
బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. మరోసారి తన విశ్వరూపం చూపించబోతుంది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఈ బ్యూటీ హిట్ లేదు. మరోసారి ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న `మంగళవారం` చిత్రంలో నటిస్తుంది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత మరోసారి ఆమె బోల్డ్ రోల్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పాయల్ టాప్‌లెస్‌గా కనిపించింది. దీంతో ఈ సినిమాలో మరోసారి పాయల్ బోల్డ్ గా కనిపించబోతుందని అర్థమవుతుంది. అయితే ఆ ఫస్ట్ లుక్‌లో చూపుడు వేలిపై సీతాకోక చిలుక కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది.
లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సమకాలీన సమస్యను చర్చిస్తూ కమర్షియల్ హంగులతో ఈ `మంగళవారం` మూవీని అజయ్ భూపతి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ విషయాలను హైడ్ చేస్తూ ఓ రకమైన సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ వస్తోంది యూనిట్. సైలెంట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇక విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు పెంచారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. టీజర్ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. జులై 4న టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. `మీరు ఎన్నడూ చూడని, ఎప్పటికీ మర్చిపోలేని కథని చూడబోతున్నారని తెలిపింది యూనిట్. జులై 4న ఉదయం 10.30 గంటలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా `కళ్లలో భయం` అనే క్యాప్షన్‌ని పంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. పోస్టర్ సైతం వాహ్ అనిపించేలా ఉంది.
`ఆర్‌ఎక్స్ 100`లో పాయల్ రాజ్‌పుత్ గ్లామరస్‌గా, బోల్డ్ గా నటిస్తూనే నెగటివ్ షేడ్స్ ని చూపించింది. హీరోయిన్‌లో అలాంటి షేడ్ ని వెండితెరపై చూపించడం చాలా అరుదు. దీంతో అదొక ట్రెండ్ సెట్టర్ అయ్యింది. ఇప్పుడు `మంగళవారం` సినిమా కూడా అలాంటి ఏదో కొత్త అంశంతో తెరకెక్కించారని అర్థమవుతుంది. ఆ విషయాలు తేలేందుకు మరో నాలుగు రోజులు టైముంది. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వాతి గుణపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. `కాంతార` ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుందట యూనిట్.
ఇదిలా ఉంటే చాలా కాలంగా పాయల్‌కి సక్సెస్ లేదు. నిజానికి `ఆర్‌ఎక్స్ 100` తర్వాత హిట్ పడలేదు. అలాగే దర్శకుడు అజయ్ భూపతికి కూడా అదే పరిస్థితి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరి ఈ సినిమాతో సక్సెస్ అయి ఈ ఇద్దరి కెరీర్‌లను గాడిలో పడేస్తుందా చూడాలి.