
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఆయన సినిమాల కోసం అభిమానులు, ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు ఉంటారు. చివరిగా ‘సార్’ మూవీతో ధనుష్ ఇక్కడ హిట్ అందుకున్నారు. ఇది ఆయనకు తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్ కావడం విశేషం. ఇప్పుడు తెలుగులోనే మరో సినిమా మొదలైంది.
ఆ మధ్యలో ధనుష్ - శేఖర్ కమ్ముల Sekhar Kammula కాంబోలో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు ఆ మూవీ షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతం DNS అని వర్కింట్ టైటిల్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున Nagarjuna కూడా నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ హీరో కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాల తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది. తెలుగు, తమిళంలో బైలింగ్వుల్ గా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్లుగా రామకృష్ణ సబ్బాని మరియు మోనికా నిగోత్రే వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక DNS అంటే ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఉదయం పూజా కార్యక్రమం లాంఛనంగా జరిగింది. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందన్నారు. మొదటి షెడ్యూల్ లోనే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ధనుష్ సంక్రాంతికి ‘కెప్టెన్ మిల్లర్’ Captain Miller సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది. త్వరలో తెలుగులోనూ రాబోతోంది. అక్కడ ఈ సినిమాను మంచి రెస్పాన్స్, కలెక్షన్లు అందుతున్నాయి.