#Gunturkaaram 'గుంటూరు కారం' అక్కడ భారీ డ్రాప్ ..కారణం

Published : Jan 18, 2024, 02:45 PM IST
#Gunturkaaram 'గుంటూరు కారం' అక్కడ భారీ డ్రాప్ ..కారణం

సారాంశం

గుంటూరు కారం సినిమా విడుదలైన ఆరు రోజుల్లో 72 శాతం వసూల్లు రికవరీ చేసింది. అంటే సినిమాకు ఇంకా రూ. 32 కోట్లకుపైగా వసూలు చేయాల్సిందిగా తెలుస్తోంది. 


సంక్రాంతి కానుకగా విడుదలైన  గుంటూరు కారం బుధవారం అంటే ఆరో రోజున కలెక్షన్లు బాగా తగ్గినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. వాస్తవానికి గుంటూరు కారం తొలి ఆట నుంచే డివైడ్  టాక్  తెచ్చుకుంది. అయినా  మహేష్ మేనియాతో వ‌సూళ్ల‌లో మాత్రం ఓ రేంజిలో  దూసుకుపోయ్యింది. దానికి తోడు  హ‌నుమాన్ మిన‌హా మిగిలిన సంక్రాంతి సినిమాల‌ు ఏవీ పోటి ఇవ్వకపోవటం గుంటూరు కారంకు  క‌లిసివ‌స్తోంది. మహేష్ బాబు ఛార్మ్,ఫ్యామిలీలలో ఆయనకు ఉన్న  ఫాలోయింగ్ బాగా వర్కవుట్ అవుతోంది. దానికి తోడు త్రివిక్రమ్ మార్క్ సెంటిమెంట్ ఫ్యామిలీలకు నచ్చుతోంది. ఈ క్రమంలో  గుంటూరు కారం 100 కోట్ల రూపాయల మార్కును దాటి రికార్డ్ సృష్టించటం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలగ చేస్తోంది. అంటే నెట్ కలెక్షన్లలో గుంటూరు కారం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరై సత్తా చాటింది. అయితే నైజాం లో మాత్రం భారీ డ్రాప్ కనిపిస్తోందని చెప్తున్నారు. అందుకు కారణాలు రకరకాలు కనపడుతున్నాయి.

మొదట సంక్రాంతి శెలవలు అయ్యిపోవటం , అలాగే రెండవది ప్రధానమైనది ఈ సినిమాకు పెట్టిన టిక్కెట్ రేట్లు. పరిశీలిస్తే ప్యాన్ ఇండియా భారీ సినిమాలు RRR,KGF 2,Salaar కు ఇచ్చిన హైకే ఈ సినిమాకు తీసుకున్నారు. ఆ మూడు సినిమాలు మాసివ్ బడ్జెట్ లతో వచ్చాయి. అలాగే ఈ సినిమాలకు పాజిటివ్ మౌత్ టాక్ కలిసొచ్చింది. కానీ గుంటూరు కారం రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మొదటి షోకే టాక్ తెచ్చుకుంది. అలాంటప్పుడు సింగిల్ స్క్రీన్స్ కు 250, మల్టిఫ్లెక్స్ లకు 413 పెట్టడం మాత్రం ఇబ్బందిగా మారిందంటున్నారు. దిల్ రాజు కనక వెంటనే రంగంలోకి దిగి హైక్ తీయించేసి ఉంటే ఖచ్చితంగా డ్రాప్ ఉండేది కాదని చెప్తున్నారు. అలా చేయకపోవటంతో టిక్కెట్ రేట్లు నార్మల్ గా ఉన్న  హనుమాన్ కు,   నా సామి రంగా చిత్రాలకి జనం వెళ్తున్నారు. గుంటూరు కారం సినిమా విడుదలైన ఆరు రోజుల్లో 72 శాతం వసూల్లు రికవరీ చేసింది. అంటే సినిమాకు ఇంకా రూ. 32 కోట్లకుపైగా వసూలు చేయాల్సిందిగా తెలుస్తోంది. 
 
  గుంటూరు కారం చిత్రంలో శ్రీలలో పాటు  హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.   హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది..  అతడు, ఖలేజా  చిత్రాల తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన  ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.  మహేశ్‌ - త్రివిక్రమ్‌ స్టైల్ మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌