తాగుబోతును తరిమికొట్టిన విశాల్.. షూటింగ్ లో విచిత్ర సంఘటన

Published : Jan 18, 2024, 01:54 PM ISTUpdated : Jan 18, 2024, 01:58 PM IST
తాగుబోతును తరిమికొట్టిన విశాల్.. షూటింగ్ లో విచిత్ర సంఘటన

సారాంశం

క్యూ లో నిల్చున్న ఓ వ్యాక్తిని తన్ని తరిమాడు తమిళ హీరో విశాల్. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ విశాల్ ఆ వ్యక్తిని ఎందుకు కొట్టాడో తెలుసా..?   

నటుడు విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని బ్లాక్ బస్టర్ హిట్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. నటుడు విశాల్ కెరీర్‌లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా మార్క్ ఆంటోని రికార్డు సృష్టించింది.

మార్క్ ఆంటోని సక్సెస్ తర్వాత విశాల్ ప్రస్తుతం రత్నం సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ గతంలో తామిరభరణి, పూజై చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పుడు రత్నంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు జతకట్టారు.

రత్నం సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంతలో రత్నం సెట్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. రత్నం కోసం టాస్మాక్ షాపులాంటి సెట్ వేశారు.

 

ఇది అసలైన టాస్మాక్‌గా భావించి క్యూలైన్ల వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు జనాలు బారులు తీరారు. . ఇది చూసి అంతా షాక్ అయ్యారు. అంతే కాదు వారిని కంట్రోల్ చేయడం యూనిట్ వల్ల అవ్వలేదు. నటుడు విశాల్.. మద్యం కొనేందుకు నిలబడిన ఓ తాగుబోతుని పట్టుకుని ఇది రత్నం సినిమా కోసం ఏర్పాటు చేశారంటూ ఆవ్యక్తిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. 

అంతే కాదు మద్యం మత్తులో ఉన్న ఆ వ్యాక్తిని కొట్టి తరిమేశాడు. ఇక  దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ విడుదలై వైరల్‌ అవుతోంది. విశాల్ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే ఈ వీడియో సినిమా ప్రమోషన్ కోేసం సరదాగా చేసినట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌