Dhanush Telugu Movie : మొన్న శేఖర్ కమ్ముల..ఇప్పుడు త్రివిక్రమ్.. తెలుగులో ధనుష్ వరుస సినిమాలు...

By Mahesh JujjuriFirst Published Dec 23, 2021, 10:55 AM IST
Highlights

ధనుష్(Dhanush) తెలుగు స్టైయిట్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. శేఖర్ కమ్ముల(Shekar Kammula)  కంటే ముందు.. వెంకీ అట్లూరి సినిమా చేయబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో.. ఈసినిమా టైటిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు. 

కోలీవుడ్‌ లో స్టార్‌ హీరో ధనుష్(Dhanush)  కు తెలుగులో కూడా భారీగా  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్‌ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తుంటాయి. అయితే ఇంత మంచి మార్కెట్ ఇక్కడ ఉన్నా ఇప్పటి వరకూ ధనుష్(Dhanush)  డైరెక్ట్ తెలుగు సినిమా చేయలదు. గతంలో బాలీవుడ్ కు, కోలీవుడ్ కు తెలుగు ఇండస్ట్రీపై కొంచెం చిన్న చూపు ఉండేది. కాని బాహుబలి తరువాత టాలీవుడ్ రేంజ్ మారిపోయింది.బాలీవుడ్ ను దాటుకుని పరుగులు తీస్తుంది టాలీవుడ్. దాంతో ఇతర భాషల హీరోలు కూడా తెలుగు సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సినిమాల ద్వారా పాన్ ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధనుష్(Dhanush)  కూడా తెలుగులో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

 ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ( Venky Atluri )ప్రాజెక్టుకు ధనుష్‌ పచ్చజెండా ఊపాడు.విద్యా వ్యవస్థలోని లొసుగుల నేపథ్యంతో  కథ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాను పీరియాడికల్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేశారట. Venky Atluri ఈమధ్యనే నితిన్ తో రంగ్ దే సినిమా చేశారు.  డైరక్టర్ గా వెంకీ అట్లూరి ( Venky Atluri )చేసిన నాలుగు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ కాగా.. మరోటి యావరేజ్.. మిగిలిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా సరే సబ్జెక్ట్ మీద నమ్మకం, వెంకీ అట్లూరి టేకింగ్ నచ్చి.. Dhanush  ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

My next .. a Tamil , telugu bilingual pic.twitter.com/QAnfs9P9yC

 

ఇక ఈ సినిమా టైటిల్ ను ఈరోజు (డిసెంబర్ 23)న రిలీజ్ చేశారు టీమ్. మూవీకి సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  తెలుగు,తమిళ, ఇంగ్లీష్ భాషల్లో టైటిల్ రిలీజ్ చేశారు టీమ్. ఈ మూవీకి జీవి ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ చేస్తున్నారు. నాగవంశీ-సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈమూవీ సితారా ఎంటర్ టైన్మెంట్స్లో 14వ సినిమాగా త్రివిక్రం సొంత బ్యానర్ ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమాగా భారి క్రేజ్ దక్కించుకుంది.

 

అసలు ముందుగా తన తెలుగు ఫస్ట్ సినిమా శేఖర్ కమ్ముల (Shekar Kammula)  డైరెక్షన్ లో అనౌన్స్ చేసినా ధనుష్  (Dhanush) వెంకీ సినిమానే ముందు అప్డేట్ ఇస్తుండటం విశేషం. శేఖర్ కమ్ముల తో చేయబోయే సినిమా వర్క్ నెమ్మదిగా నడుస్తుండటం. కథ విషయంలో ఇంకా పని మిగిలి ఉండటంతో.. లేట్ చేయకుండా వెంకీ అట్లూరి( Venky Atluri )ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తున్నాడు ధనుష్. వరుసగా రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలతో తెలుగు లో తన  ఇమేజ్ ఇంకా  పెంచుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు తమిళ స్టార్ హీరో అందుకే ఫాస్ట్ గా పావులు కదుపుతున్నాడు .Shekar Kammula మూవీ ఎలాగు పక్కా హిట్ టార్గెట్ తో వస్తుంది. ఇక వెంకీ అట్లూరి తో చేస్తున్న సినిమా కూడా కూడా పీరియాడికల్ మూవీగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రెండు ప్రాజెక్టులతో Dhanush అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నాడు.

తమిళ్ తో పాటు ఇటు తెలుగు, హిందీతో పాటు అటు హాలీవుడ్ ను కూడా టార్గెట్ చేశాడుDhanush. ప్రస్తుతం హాలీవుడ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్న ధనుష్ తన సొంత లాంగ్వేజ్ లో కూడా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్నడు. తన సోదరుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో కూడా ఓ మూవీకి సైన్ చేశాడు ధనుష్(Dhanush). ఈమూవీ యుగానికి ఒక్కడు సినిమాకు సీక్వెల్ గా రానుంది. ఆ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తాని ధనుష్ గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.

Also Read : Bangarraju :ఓ షాకిచ్చే విషయం,అందుకే రిలీజ్ డేట్ ప్రకనట లేదు

click me!