Upasana Konidela: ప్రధాని మోడీతో ఉపాసన భేటీ...!

Published : Dec 23, 2021, 10:01 AM IST
Upasana Konidela: ప్రధాని మోడీతో ఉపాసన భేటీ...!

సారాంశం

ఉపాసన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. ఇండియన్ ఎక్స్‌పో 2020 (Inidan Expo 2020) లో భాగంగా మోదీతో ఆమె సమావేశమయ్యారు. 

రామ్ చరణ్ (Ram Charan)వైఫ్ ఉపాసన పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఓ స్టార్ హీరో వైఫ్ అనే పేరుకు మించిన ప్రొఫైల్ ఆమె సొంతం. బిజినెస్ ఉమెన్ గా, సోషలిస్ట్ గా, ఫ్యాషన్, డైట్ ఎక్స్పర్ట్ గా ఆమెకు అనేక ఫీల్డ్స్ లో ప్రావీణ్యం ఉంది. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఆమె హాస్పిటల్స్ చైన్ నడుపుతున్నారు. అలాగే ఆమె అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. కాగా ఉపాసన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. ఇండియన్ ఎక్స్‌పో 2020 (Inidan Expo 2020) లో భాగంగా మోదీతో ఆమె సమావేశమయ్యారు. ఢిల్లీ వేదికగా ఇండియన్ ఎక్స్‌పో 2020 జరుగుతుంది. ప్రదానీ మోడీతో సమావేశమైన ఉపాసన సదరు ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. 

ఇక భారత ప్రధానిని కలిసిన హ్యాపీ మూమెంట్స్ ని ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి’’ అని ఉపాసన ట్వీట్ చేశారు.

Also read Rana with RRR: రామ్‌, భీమ్‌లతో భళ్లాలదేవ.. ఫోటో అదిరిపోయిందిగా.. వైరల్
బడా రాజకీయ నాయకులకు, సినిమా స్టార్స్, పారిశ్రామిక వేత్తలకు కూడా ప్రధాని మోడీ (PM Modi) అపాయింట్మెంట్ దొరడం చాలా కష్టం అలాంటిది ఉపాసన.. ఏకంగా ఆయనతో భేటీ కావడం విశేషంగా మారింది. ఇటీవలే ఉపాసన కుటుంబంలో పెళ్లి వేడుక జరిగింది. ఆమె చెల్లెలు అనుష్పాల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉపాసన(Upasana Konidela) కుటుంబానికి చెందిన దోమకొండ సంస్థానంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. పెద్ద అల్లుడు హోదాలో రామ్ చరణ్ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్