
టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథల లిస్టు ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. చాలా కాలం తరువాత ఇద్దరు స్టార్ హీరోలు నాగార్జున - నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవ దాస్. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతి ప్రొడక్షన్ లో సి.అశ్వినిదత్ నిర్మించారు. ఇకపోతే సినిమా నేడు భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే యూఎస్ లో సినిమా ప్రీమియర్స్ ను ముందుగానే ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలని దాని కోసం కథపై ఎక్కువగా ఫోకస్ చేశాడని చెప్పవచ్చు. అయితే కథను డీల్ చేసే విధానంలో ఫన్ కోసం పోయి కాస్తంత బోరింగ్ గా ప్రజెంట్ చేశాడనిపిస్తుంది. ఫస్ట్ 20 నిమిషాలు బోరింగ్ అనిపిస్తుంది. దేవ ఒక డాన్ గా ఎంట్రీ ఇచ్చిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక నాని డాక్టర్ దాస్ గా తనదైన శైలిలో కామెడీని పండించడం బాగానే ఉంది కాని కథకి మ్యాచ్ అయిన్నట్టుగా సన్నివేశాల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించదు. కథలో పెద్దగా కొత్తదనం ఏమి లేదు. సగటు ప్రేక్షకుడు ఈజిగానే గెస్ చేయగలడు. కానీ డైరెక్టర్ తన స్టైల్ లో కొంత వరకు స్క్రీన్ ప్లే లో కొత్తదనాన్ని చూపించి కామెడీ ఎంటర్టైన్మెంట్ గా మలిచే ప్రయత్నం చేశాడు.
ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని చెప్పవచ్చు.
శరత్ కుమార్ అండ్ దేవ క్రిమినల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. హాస్పిటల్ లో ఇక ఇన్నోసెంట్ డాక్టర్ దాస్ గా నాని పరిచాయమవుతాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఒక మానసిక వైద్యుడుగా అదే హాస్పిటల్ లో పనిచేస్తుంటాడు. శరత్ కుమార్ (దాదా) మర్డర్ తో సినిమా ఊహించని విదంగా మలుపు తిరుగుతుంది. నాగార్జునని చిన్నప్పటి నుంచి దాదానే పెంచి పెద్ద చేస్తాడు. అయితే గణేష్ సాంగ్ అనంతరం నాగ్ ఒక వ్యక్తిని చంపేస్తాడు. అయితే దేవ బుల్లెట్ షాట్ తో తీవ్రంగా గాయపడగా దాస్ పోలీసులుకు సమాచారం ఇవ్వకుండా అతనికి వైద్యం అందిస్తాడు.
దీంతో దాస్ ని దేవ్ కి ఇంప్రెస్ అయ్యి అతన్నీ తన పర్సనల్ MD (మాఫియా డాక్టర్) గా అపాయింట్ చేసుకుంటాడు. అప్పుడు నాని దాస్ ఆధీనంలో చిక్కుకుంటాడు. అనంతరం నాని నాగ్ మంచి మిత్రులుగా మారతారు. అతన్ని ఎలాగైనా మార్చాలని నాని ప్లాన్ చేస్తుంటాడు. దేవ దృష్టిని లవ్ పై మళ్లిస్తాడు. జాహ్నవి (ఆకాంక్ష) అనే అమ్మాయిని దేవ లవ్ చేస్తుంటాడు. దాస్ కూడ ముందుగానే పూజ (రష్మీక) అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. దేవ దాస్ మధ్య పరిణామాలు అన్ని కామెడీగా సాగుతుంటాయి. ఇక కొన్ని పరిణామాల తరువాత ఫ్రీ క్లైమాక్స్ లో దేవ దాస్ విడిపోతారు.
విలన్స్ నాగ్ ని చంపాలని టార్గెట్ చేస్తుంటారు. నాగ్ నాని మధ్య అప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. చివరగా విలన్స్ ప్లాన్స్ వలన నాగ్ నాని పాత్రలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాయి అని సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ కంటే సెకంఫ్ హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. ఫైనల్ గా సినిమా పరవాలేదు అనిపించే విధంగా ఉందని టాక్ వస్తోంది. బి సెంటర్స్ లో ఆదరణ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ నామమాత్రంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి. పూర్తి రివ్యూ కోసం asianet news తెలుగు ఫాలో అవుతూ ఉండండి.