
ఈరోజు ఎపిసోడ్లో దేవయాని జగతి ఒక గదిలోకి వెళ్ళగా ఏంటి జగతి నిన్న మొన్న వరకు ధైర్యంగా కనిపించావు ఈరోజు కాస్త టెన్షన్ పడుతున్నావు అనగా అదేం లేదు అక్కయ్య అని అంటుంది జగతి. ఇంతలోనే పళ్లెంలో చీర, పంచె తీసుకొని రావడంతో నాకెందుకు ఇస్తున్నారు అక్కయ్య అనగా ఇవి నీకు కాదు జగతి, వసు రిషి లకు ఇవ్వు అని అంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది కదా కొత్త దంపతులైన రిషి,వసులకు ఈ బట్టలు ఇచ్చి వీటిని కట్టుకొని పూజలు కూర్చోమని చెప్పు అని అంటుంది. నీకంటే ఎలాగో ఈ ఆచారాలు సంప్రదాయాలు పెద్దగా పట్టించుకోవు కదా అందుకే నేను చూసుకుంటున్నాను ఈ వ్రత ఫలితం వాళ్లకు మాత్రమే కాకుండా మన కుటుంబం మొత్తానికి కలుగుతుంది అని అంటుంది.
ఇప్పుడు దేవయాని పూర్తిగా మారిపోయినట్టు మాట్లాడడంతో జగతి ఆలోచనలో పడుతుంది. మహేంద్ర, నువ్వు కలసి ఈ కొత్త బట్టలను కొత్త దంపతులకు ఇవ్వండి అని అంటుంది. అప్పుడు జగతి రిషి పీటల మీద కూర్చోమంటే సీరియస్ అవుతాడు. వాళ్ళిద్దరి గొడవ పెట్టడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసావా అక్కయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. జగతి చేతిలో ఆ బట్టలను పెట్టి వెళ్లి వాళ్లకు ఇచ్చి రాపో అని చెబుతుంది. తర్వాత జగతి లోపలికి వెళ్ళగా చూసావా మహేంద్ర అక్కయ్య ఎంత పెద్ద ప్లాన్ వేసిందో అనడంతో ఇప్పుడు ఎలా జగతి మనం కచ్చితంగా ఇవ్వాల్సిందే కదా అని అంటాడు.
కుదరదు అని చెప్పేద్దాం జగతి లేదంటే అన్నయ్యకు చెప్పేద్దాం అని అనగా ఏమని చెప్తావు మహేంద్ర అని అంటుంది జగతి. అక్కయ్య ఫుల్ ప్లాన్లో ఉంది మహేంద్ర ఇటువంటి సమయంలో మనం వెనకడుగు వేయకూడదు. పెళ్ళాం పదా అని ఇద్దరు కలిసి వసుధార గదిలోకి వెళ్తారు. రండి సార్ ఏంటి మేడం ఇలా వచ్చారు చేతిలో ఇవేంటి అనగా తీసుకో వసు అక్కయ్య ఇచ్చింది అనడంతో వసుధార ఆశ్చర్య పోతుంది. నువ్వు రిషి ఇద్దరు దంపతుల్లా పీఠం మీద కూర్చోవాలి అనగా ఇది ఎలా సాధ్యం మేడం అని టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధార. మేడం మీ దగ్గరగా ఉన్నామన్న మాటే కానీ ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం ఉంది. రిషి సార్ కూడా మనసులో ఏదో తెలియని విషయంలో బాధపడుతున్నారు అని అంటుంది. మేడం రిషి సార్ కోపం గురించి మీకు తెలుసు.
ఇప్పుడు వెళ్లి మనిద్దరం ఇలా భార్యాభర్తలు గా కూర్చోవాలి అనడంతో మా మధ్య ఉన్న దూరం అమాంతం పెరిగిపోతుంది అని అంటుంది. అప్పుడు జగతి ఇలా అయినా మీ మధ్య దూరం తగ్గుతుందని నువ్వు ఎందుకు అనుకోవడం లేదు అంటుంది. రిషి ఒప్పుకోడని ఎందుకు అనుకుంటున్నావు దేవయాని అక్కయ్య మీద ఉన్న ప్రేమతో కాదనడేమో అని అంటుంది. భయపడకుండా ఇది ఒక మంచి అవకాశంగా భావించి ముందడుగు వేయి వసు ఏది జరిగితే అది జరుగుతుంది అంటూ వసుధారకీ ధైర్యం చెబుతుంది జగతి. అప్పుడు వసుధార చేతిలో ఆ బట్టలు పెట్టేసి ఇకనుంచి వెళ్ళిపోతారు. తర్వాత వసుధార, రిషి ఎదురుగా నిలబడి ఆ బట్టల వైపు చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అనగా దేవయాని మేడం అంటుండగా లోకం దృష్టిలో మనం భార్యాభర్తలమే కానీ అసలు నిజం ఏంటో మనిద్దరికీ తెలుసు నువ్వే చెప్పు వసుధార మనిద్దరం ఆ పీటల మీద ఎలా కూర్చుంటాము అని అంటాడు రిషి. నువ్వే మనస్ఫూర్తిగా చెప్పు వసుధార మనం భార్యా భర్తలము అయ్యామా అనడంతో వసుధార ఆలోచనలో పడుతుంది. ఈ ఆలోచన నిజంగా పెద్దమ్మదేనా అని అడగడంతో వసుధార షాక్ అవుతుంది. వసుధర ఒకసారి నువ్వే ఆలోచించు మనిద్దరం దంపతుల్లా పక్క పక్కన కూర్చుందామా అని అంటాడు రిషి. ఇలా చేయడం కరెక్టేనా ఇందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నిస్తాడు రిషి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడతారు. మనిద్దరం పూజలో కూర్చోవడం కరెక్టేనా నీకు ఇష్టమేనా మనిద్దరం భార్యాభర్తలమా అని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు రిషి.
ఇలా చేయడానికి మనకు నిజంగా అర్హత ఉందని నువ్వు భావిస్తున్నావా అని అంటాడు. అప్పుడు వసుధార ఏం మాట్లాడాలో తెలియక ఆలోచనలో పడుతుంది. మరొకవైపు అందరూ పూజ దగ్గర నిలబడి ఉంటారు. అప్పుడు జగతి, మహేంద్ర ఏమై ఉంటుంది ఇంకా రావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు దేవయాని వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఇప్పుడు కచ్చితంగా గొడవ జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది. ఈ రోజు నాకు అవకాశం దొరికింది రిషి మనసులో వసుధార స్థానం ఏంటో ఈరోజు నాకు తెలిసిపోతుంది అనుకుంటూ ఉంటుంది.అప్పుడు పంతులుగారు నవ దంపతులను రమ్మని చెప్పండి అనడంతో అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు దేవయాని ధరణి వెళ్లి వాళ్ళని పిలుచుకొని రా అనడంతో ధరణి టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇంతలోనే వసుధార, రిషి ఇద్దరు ఆ కొత్త బట్టలతో రావడంతో అది చూసి మహేంద్ర వాళ్ళ సంతోషపడుతుండగా దేవయాని షాక్ అవుతుంది. ఇప్పుడు జగతి, మహేంద్ర ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు దేవయాని రండి రిషి వచ్చి పీటల మీద కూర్చుండి అనడంతో మేము పీటల మీద కూర్చోవడం లేదు పెద్దమ్మ అని అంటాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. మరి ఎవరు కూర్చుంటారు అనగా డాడ్ మేడం మీరు కూర్చోండి అని అంటాడు. ఆ మాటకు దేవయాని షాక్ అవుతుంది. డాడ్ ప్లీజ్ చెప్పింది వినండి మీరు మేడం గారు కలిసి పీటల మీద కూర్చొని పూజ చేయండి అని అంటాడు రిషి. వాళ్లు కూర్చోవడం ఏంటి రిషి అనగా ఈ విషయం గురించి నేను మీతో తర్వాత మాట్లాడతాను పెద్దమ్మ. డాడ్ మీరు వెళ్లి కూర్చోండి అనడంతో జగతి మహేంద్ర పూజలో కూర్చుంటారు. దాంతో దేవయాని షాక్ అవుతుంది. ఆ తర్వాత అందరూ పూజలో కూర్చోగా అప్పుడు రిషి వసు గదిలో మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.