తప్పుడు సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు.. మ్యూజిక్‌లెజెండ్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌ సంచలన వ్యాఖ్యలు..

Published : Mar 15, 2023, 10:10 PM IST
తప్పుడు సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారు.. మ్యూజిక్‌లెజెండ్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

సంగీత సంచలనం ఏ ఆర్‌ రెహ్మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారని ఆరోపించారు. తాను కొన్ని సినిమాలు ఆస్కార్‌ కి వెళ్తాయని అనుకుంటాయని, కానీ అవి వెళ్లవని, వాటిని ఎంపిక చేయరని ఆయన తన అసహానాన్ని వెల్లడించారు. 

ఇండియన్‌ ఫిల్మ్ ఫెడరేషన్‌ జ్యూరీపై ఇండియన్‌ సినిమా సంగీత సంచలనం ఏ ఆర్‌ రెహ్మాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కి పంపిస్తున్నారని ఆరోపించారు. తాను కొన్ని సినిమాలు ఆస్కార్‌ కి వెళ్తాయని అనుకుంటాయని, కానీ అవి వెళ్లవని, వాటిని ఎంపిక చేయరని ఆయన తన అసహానాన్ని వెల్లడించారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడారు.  `ఆర్‌ఆర్‌ఆర్‌`(నాటునాటు సాంగ్‌కి), `ది ఎలిఫెంట్‌ విస్పరర్స్` డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్‌ అవార్డులు వరించాయి. ఇండియన్‌ సినిమాలకు ఆస్కార్‌ అవార్డు రావడమనేది ఇదే తొలిసారి. 

ఈ నేపథ్యంలో మ్యూజిక్‌ లెజెండ్‌ రెహ్మాన్‌.. మరో ప్రముఖ సంగీత దిగ్గజం ఎల్‌ సుబ్రమణ్యంతో కలిసి సంగీతానికి సంబంధించిన కన్వర్జేషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీతంలో వచ్చిన మార్పులు, ఆయన సక్సెస్‌ సీక్రెట్‌, ఇప్పుడున్న సంగీతం, అవార్డులపై ధీర్ఘంగా చర్చించారు. ఇందులో రెహ్మాన్‌ తన బ్రాడ్‌ ఐడియాలజీని పంచుకున్నారు. 

ముఖ్యంగా అవార్డులకు సంబంధించి రెహ్మాన్‌ రియాక్ట్ అవుతూ, కొన్ని సార్లు మన సినిమాలు ఆస్కార్‌ వరకు వెళ్తాయని నేను ఎదురుచూస్తుంటాను. కానీ అవి అంత వరకు వెళ్లవు. తప్పుడు సినిమాలను ఆస్కార్‌కి పంపుతున్నారు. దీంతో నేను ఏం చేయలేని స్థితిలో ఉంటున్నాను. మనం మరొకరి పాదరక్షా ఉండాలి. నేను ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలంటే ఫారెన్‌ వారి షూస్‌లో ఉండాలి, వాళ్లు ఏం చేస్తున్నారో తెలియాలంటే నేను నా పాదరక్షల్లో ఉండాలని వెల్లడించారు రెహ్మాన్‌. 

పరోక్షంగా రెహ్మాన్‌ మంచి సినిమాలను ఆస్కార్‌ కి సెలక్ట్ చేయడం లేదని, వాటిని గుర్తించడం లేదని అన్నారు. ఆస్కార్‌ నామినేషన్‌కి పంపించే ఇండియన్‌ ఫిల్మ్ ఫెడరేషన్‌కి సంబంధించిన ఆస్కార్‌ జ్యూరీ సరైన సినిమాలను ఎంపిక చేయడంలో విఫలమవుతుందని, తప్పుడు సినిమాలను పంపిస్తున్నారని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. అయితే మొన్న `ఆర్‌ఆర్‌ఆర్‌`ని ఇండియన్‌ ఫిల్మ్ ఫెడరేషన్‌ ..ఆస్కార్‌కి సెలక్ట్ చేయలేదు. అనామక ఓ గుజరాతీ చిత్రాన్ని ఎంపిక చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. రెహ్మాన్‌ సైతం ఇలాంటి కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే రెహ్మాన్‌ ఈ వ్యాఖ్యలు రెండు నెలల క్రితమే చేశారు. కానీ ఇప్పుడు యాప్ట్ గా నిలుస్తున్నాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `ది ఎలిఫెంట్‌ విస్పరర్స్` చిత్రాలకు ఆస్కార్‌ రావడంతో రెహ్మాన్‌ వ్యాఖ్యలు ట్రెండ్‌ అవుతున్నాయి. హాట్‌ టాపిక్‌గా మారాయి. 

ఇక సంగీతానికి సంబంధించిన ఆయన మాట్లాడుతూ, ఆర్కేస్ట్రాతో సంగీతాన్ని సమకూర్చడం గురించి చెబుతూ, అప్పట్లో వారి వద్ద ఒక చిత్రానికి ఎనిమిది ట్రాక్‌ లు ఉండేవి, నేను జింగిల్స్ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నా వద్ద 16 ట్రాక్‌లు ఉన్నాయి. వాటితోనే మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తాను. దీని ద్వారా చాలా చేయగలను. అయితే దాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందరూ డెప్త్  కావాలి, ఆర్కెస్ట్రా ఖర్చుతో కూడుకున్నదని భావిస్తున్నారు, కానీ పెద్ద వాయిద్యాలన్నీ ఇప్పుడు చిన్నవిగా మారాయి. కాబ్టటి నేను సాంకేతిక మార్పుని అందిపుచ్చుకుని కొత్త తరహా మ్యూజిక్‌ని అందిస్తున్నాను. 

నేను ప్రయోగాలు చేసిన విఫలం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటి వరకు మ్యూజిక్‌ పరంగా నా ఫెయిల్యూర్‌ ఎవరికీ తెలియదు, వాళ్లు నా విజయాన్ని మాత్రమే చూశారు. ఎందుకంటే ఇదంతా నేను స్టూడియోలోనే సృష్టించాను. మేం మళ్లీ మళ్లీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. అందుకు కారణం నాకు హోమ్‌ స్టూడియో ఉండటమే. దీని కారణంగా నాకు మంచి స్వేచ్ఛ లభించింది. సంగీత పరంగా ప్రయోగాలు చేయడానికి సాధ్యమైంది. ఇలాంటి ప్రయోగాలు చేయడానికి డబ్బు కావాలనుకుంటారు. అది మాత్రమే కాదు, నాకు సంగీతంపై ఓ ప్యాషన్‌ ఉంది. పాశ్చత్య దేశంలో ఇలాంటి సంగీతాన్ని వింటున్నప్పుడు, అలాంటిది మనమెందుకు చేయకూడదనే ఆలోచన నుంచి మెరుగైన ఉత్పత్తి, మెరుగైన నాణ్యత, మెరుగైన పంపిణీ, మాస్టరింగ్‌ లభిస్తుందని చెప్పారు రెహ్మాన్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్