Sarkaru Vaari Paata:మహేష్ కు ప్యాన్ ఇండియా తలనొప్పి, ఏం చెయ్యాలి?

Surya Prakash   | Asianet News
Published : Jan 21, 2022, 02:09 PM IST
Sarkaru Vaari Paata:మహేష్ కు ప్యాన్ ఇండియా తలనొప్పి, ఏం చెయ్యాలి?

సారాంశం

పరశురామ్ దర్శకత్వంలో బ్యాంకింగ్ రంగంలో జరిగుతున్న అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట,


సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహించగా 'మహానటి' కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేస్తోంది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా (జనవరి 14) థియేటర్లలో సందడి చేయాల్సింది. దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌)ను జనవరి 7న రిలీజ్‌ చేస్తామని ప్రకటించడం, తర్వాత కరోనా ఇలా పలు కారణాలతో 'సర్కారు వారి పాట' మూవీ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. తర్వాత ఏప్రిల్‌ ఒకటిన రిలీజ్‌ చేస్తామని చిత్ర టీమ్ ప్రకటించింది. అయితే మళ్లీ తాజాగా ఈ డేట్‌కు కూడా విడుదల చేయడం అనుమానమే అంటున్నాయి సినీ వర్గాలు. అది ప్రక్కన పెడితే ఇప్పుడు మహేష్ కు ఓ చిత్రమైన పరిస్దితి ఎదురౌతోంది.

ఓ ప్రక్కన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా వరస హీరోలంతా తమ సినిమాలకు ప్యాన్ ఇండియా రిలీజ్ కు తగినట్లు గా రూపొందించి రిలీజ్ చేస్తున్నారు. దాంతో మహేష్ అభిమానులు తమ హీరో సినిమా కూడా ప్యాన్ ఇండియా రిలీజ్ అయితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. 'సర్కారు వారి పాట'ని ప్యాన్ ఇండియా స్దాయిలో వర్కవుట్ చేసి రిలీజ్ చేయమంటున్నారు. అయితే మహేష్ ఎప్పుడూ తెలుగు మార్కెట్ తో కంపర్ట్ గా ఉన్నానని చెప్తున్నారు. బాలీవుడ్ మార్కెట్ లో కి వెళ్లటానికి కూడా ఆసక్తి చూపలేదు. ఈ నేపధ్యంలో ఈ కొత్త డిమాండ్ మహేష్ కు తలనొప్పిగా మారుతోందనటంలో సందేహం లేదు.

పరశురామ్ దర్శకత్వంలో బ్యాంకింగ్ రంగంలో జరిగుతున్న అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?