Devara Glimpse: ఎన్టీఆర్‌ విశ్వరూపం.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న `దేవర` గ్లింప్స్

Published : Jan 08, 2024, 04:10 PM IST
Devara Glimpse: ఎన్టీఆర్‌ విశ్వరూపం.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న `దేవర` గ్లింప్స్

సారాంశం

ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌ `దేవర` గ్లింప్స్ రానే వచ్చింది. అతి భయంకరమైన ఆయన వాయిస్‌ తో సాగే గ్లింప్స్ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. 

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` చిత్రంపై ప్రారంభం నుంచే భారీ అంచనాలున్నాయి. ఓపెనింగ్‌ రోజు దర్శకుడు కొరటాల చెప్పిన స్టోరీతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఆ తర్వాత హింట్‌ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదల చేసిన ఎన్టీఆర్‌ నయా లుక్‌ అదిరిపోయింది. ఇక సంక్రాంతి కానుకగా `దేవర` గ్లింప్స్ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. 

ఇక ఆ టైమ్‌ రానే వచ్చింది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఊగిపోయే `గ్లింప్స్ వచ్చింది. వెన్నులో వణుకు పుట్టించేలా, ఆద్యంతం మతిపోయేలా ఈ గ్లింప్స్ ఉండటం విశేషం. తారక్‌ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అలానే ఉంది. కొరటాల టేకింగ్‌, ఎన్టీఆర్‌ యాక్షన్‌ సీన్లు, డైలాగ్‌ డెలివరీ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ విశ్వరూపం చూడొచ్చు. అనిరుథ్‌ బీజీఎం మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంది. 

గ్లింప్స్ అనిరుథ్‌ ఇంగ్లీష్ సాంగ్‌తో ప్రారంభమైంది. సముద్రంలో పడవల్లో సముద్రపు దొంగలు ఓడని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇక రంగంలోకి దిగిన తారక్‌ వారిని తెగనరికి సముద్రపు ఒడ్డున పడేస్తాడు. దీంతో సముద్రం మొత్తం రక్తంతో ఎర్రగా మారుతుంది. అ సమయంలో ఈ సముద్రం చేపల కంటే కత్తులు, నేత్తురునే ఎక్కువగా చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. ఇందులో తారక్‌ లుంగీ కట్టుకుని ఓ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని లుక్‌లో ఆయన ఆకట్టుకుంటున్నారు. ఊర మాస్‌గా ఉన్నారు. 

గ్లింప్స్ కి సంబంధించి ముందునుంచి అంచనాలు పెంచేలా, గ్లింప్స్ కంటెంట్‌ని తెలియజేసేలా సాగే కొటేషన్లు ఆకట్టుకున్నాయి. `నువ్వు ఎప్పుడూ సముద్రాన్ని తాకవు, నువ్వు నాతో ఆడుకోలేవు, నేను నిన్ను ఎప్పటికీ కరుణించను, నేను నిన్ను ఎప్పటికీ ఉండనివ్వను, రాక్తం కారుతోంది, చుట్టూ రక్తం, సముద్రం రక్తంతో నిండిపోయింది. ఇది అతని ఎర్ర సముద్రం` అంటూ ఎలివేషన్‌ ఇచ్చేలా సాగే కొటేషన్లు గూస్‌బంమ్స్ తెప్పించాయి. 

ఇక ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ బ్యానర్లపై ఈ మూవీ భారీ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో