`గుంటూరు కారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కొత్త వేదిక, డేట్‌ ఫిక్స్.. గ్రౌండ్‌లో కాదా? మరెక్కడా?

Published : Jan 08, 2024, 02:23 PM IST
`గుంటూరు కారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కొత్త వేదిక, డేట్‌ ఫిక్స్.. గ్రౌండ్‌లో కాదా? మరెక్కడా?

సారాంశం

మహేష్‌ బాబు నటిస్తున్న `గుంటూరు కారం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన కొత్త వేదిక ఫిక్స్ అయ్యింది. కొత్త డేట్‌ని కూడాయూనిట్‌ ప్రకటించింది. 

మహేష్‌బాబు నటిస్తున్న `గుంటూరు కారం` చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కిపై గత మూడు రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుంది. హైదరాబాద్‌ శనివారం జరగాల్సిన ఈవెంట్‌ కాన్సిల్ కావడంతో నెక్ట్స్ ఎక్కడా అనే డౌట్‌ నెలకొంది. దీనిపై చిత్ర బృందం కూడా స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొత్త తేదీ, కొత్త వేదిక త్వరలో ప్రకటిస్తామని యూనిట్ చెప్పింది. దీంతో అనేక ఊహాగానాలు వినిపించాయి. తాజాగా దీనికి క్లారిటీ ఇచ్చింది యూనిట్‌. ఈవెంట్‌ వేదిక, డేట్‌ని అధికారికంగా ప్రకటించారు. 

రేపు(జనవరి 9న) `గుంటూరుకారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్టు వెల్లడించింది. వేదికని మార్చారు. హైదరాబాద్‌లో కాకుండా ఈ సారి కొత్తగా గుంటూరుకి షిఫ్ట్ చేశారు. గుంటూరులోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని నంబూరు ఎక్స్ రోడ్స్ వద్ద ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేయడం విశేషం. నంబూరు ఎక్స్ రోడ్‌లోని ఓపెన్‌ ప్లేస్‌లో ఈ ఈవెంట్‌ చేయబోతున్నారట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చింది యూనిట్‌. అయితే ఈ వేడుకకి గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎవరైనా ఉంటారా? లేక మహేష్‌తోనే కానిచ్చేస్తారా? అనేది సస్పెన్స్. 

మహేష్‌ నటిస్తున్న `గుంటూరు కారం` చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో కథానాయికగా కనిపించబోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఊపేస్తుంది.క్లాస్‌, మాస్ మేళవింపుగా ట్రైలర్ సాగింది. సంక్రాంతి పండక్కి కావాల్సిన అన్ని రుచులు ఇందులో మేళవించాడు దర్శకుడు త్రివిక్రమ్‌. అంతేకాదు ఈ సినిమాలో తనలోని కొత్త యాంగిల్‌ చూపించారు. మహేష్‌ని చాలా మాస్‌గా చూపించాడు. కొన్ని బోల్డ్ డైలాగ్లు, యాక్షన్‌ సీన్లు ఫ్యాన్స్ ఈలలు వేసేలా ఉన్నాయి. ఇక సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో