ఆకలి ఎక్కువే, వేట కూడా అలాగే ఉంటుంది.. పవన్ ఓజిపై పుకార్లకు చెక్, దిమ్మతిరిగే కౌంటర్ తో ఫుల్ క్లారిటీ

Published : Jan 08, 2024, 01:26 PM IST
ఆకలి ఎక్కువే, వేట కూడా అలాగే ఉంటుంది.. పవన్ ఓజిపై పుకార్లకు చెక్, దిమ్మతిరిగే కౌంటర్ తో ఫుల్ క్లారిటీ

సారాంశం

పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్న చిత్రం మాత్రం ఓజి అనే చెప్పాలి.  డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్న చిత్రం మాత్రం ఓజి అనే చెప్పాలి.  డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

ఓజితో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలని కూడా పూర్తి చేయాల్సి ఉంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓజి పై కసితో ఉన్నారు. ఈ ఏడాది ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చిన మాస్ రచ్చ గ్యారెంటీ. తాజాగా ఓజి చిత్రంపై రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. 

ఈ చిత్రం నిర్మాత చేతులు మారుతోంది అంటూ పుకార్లు పుట్టుకువచ్చాయి. డివివి దానయ్య ఓజి చిత్రాన్ని పీపుల్స్ మీడియా వారికి ఇచ్చేస్తున్నారని కొందరు పుకార్లు సృష్టించారు. అయితే నిర్మాత డివివి దానయ్య మొదటి నుంచి ఓజి చిత్రంపై అంతో ఆసక్తిగా ఉన్నారు. మూడేళ్లు పవన్ వెంటపడి ఈ ప్రాజెక్టు ఒకే చేసుకున్నారు. 

ఈ చిత్రానికి క్రేజ్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంది. ఇలాంటి తరుణంలో దానయ్య ఎందుకు ఓజి చిత్రాన్ని వదిలేసుకుంటారు అనే చర్చ జరిగింది. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ రూమర్స్ ని నమ్మలేదు. తాజాగా వారి నమ్మకమే నిజమైంది. ఓజిపై వస్తున్న రూమర్స్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ డివివి ఎంటెర్టైనమెంట్స్ సంస్థ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. 

'ఓజి మూవీ మాది.. ఓజి ఎప్పటికీ మాదే. పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎలా తెరకెక్కించాలో మాకు తెలుసు. ఈ చిత్రాన్ని చక్కగా షూట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆకలి ఎక్కువగా ఉందని తెలుసు. కానీ చిరుత వేట కూడా అలాగే ఉంటుంది అంటూ అఫీషియల్ గా పోస్ట్ చేశారు. గాసిప్స్ పుట్టించిన వాళ్ళకి ఇది పెద్ద రాడ్ అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు