`దేవర` గ్లింప్స్ త్వరలో.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన కళ్యాణ్‌ రామ్‌..

Published : Dec 12, 2023, 09:36 PM ISTUpdated : Dec 12, 2023, 10:37 PM IST
 `దేవర` గ్లింప్స్ త్వరలో.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన కళ్యాణ్‌ రామ్‌..

సారాంశం

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న `దేవర` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చాడు కళ్యాణ్‌ రామ్‌. `దేవర` గ్లింప్స్ కి సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. 

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన `దేవర` చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. సినిమా నుంచి అప్‌డేట్ల కోసం ఆతృతగా ఉన్నారు. కానీ చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్లు రావడం లేదు. షూటింగ్‌ ఎంత వరకు వచ్చింది. ఏం జరుగుతుందనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాత కళ్యాణ్‌ రామ్‌కి ఈ డిమాండ్‌ ఎదురయ్యింది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన `డెవిల్‌` చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. 

ఇందులో కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ, తన సినిమా గురించి చెప్పారు. సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డామని, మంచి సినిమాని రెడీ చేశామని, సినిమా బాగా రావడం కోసం టెక్నీషియన్లు ఎంతో శ్రమించారని తెలిపారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని `బింబిసార` ఎంత బాగా వచ్చింది, ఎంతగా నచ్చిందో దాన్ని మించి ఈ మూవీ ఉంటుందని తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. 

ఈ సందర్భంగా `దేవర`, `బింబిసార 2` అప్‌డేట్ల గురించి ఫ్యాన్స్ అడిగారు. దీనికి కాస్త సీరియస్‌ అయిన కళ్యాణ్‌ రామ్‌ ఎట్టకేలకు అప్‌డేట్‌ ఇచ్చారు. `బింబిసార2` వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా తమ్ముడు ఎన్టీఆర్‌ సినిమా `దేవర` అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. త్వరలోనే గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సినిమా విజువల్‌ వండర్‌గా ఉండబోతుందట. 

ఓ కొత్త ప్రపంచాన్ని ఆడియెన్స్ కి చూపించబోతున్నామని, వీఎఫ్‌ఎక్స్ కి ఎక్కువగా వర్క్ ఉంటుందని, దాని కోసం టీమ్‌ కష్టపడుతుందన్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` లాంటి సినిమా వచ్చాక అందరిలోనూ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం తాము ఎంతో కష్టపడతామని, ఎంతో బాధ్యతతో ఉంటామని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుందని, త్వరలోనే గ్లింప్స్ తోపాటు టీజర్‌, ఇంకా రిలీజ్‌ అప్‌డేట్లు కూడా ఇవ్వబోతున్నట్టు తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. `దేవర` మూవీని కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన `డెవిల్‌` మూవీ ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తుంది. విజువల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతుంది. ఇందులో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మాళవిక నాయర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి దర్శకుడిగా నిర్మాత అభిషేక్‌ నామా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాని నవీన్‌ మేడారం దర్శకత్వం వహించారు. కానీ దర్శకుడితో నిర్మాతకి ఏర్పడిన వివాదం కారణంగా ఆయన్ని తొలగించారు. తన పేరే వేసుకున్నారు అభిషేక్‌ నామా. 

Read more: `డెవిల్‌` ట్రైలర్‌ రివ్యూ.. వామ్మో కళ్యాణ్‌ రామ్‌ నెక్ట్స్ లెవల్‌ షో..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ