
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్. 73 ఏళ్ళ వయస్సులో కూడా ఏమాత్రం తగ్గకుండా.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాడు తన సినిమాలో. రీసెట్ గా జైలర్ సినిమాతో దుమ్ము రేపిన తలైవార్.. ప్రస్తుతం నటిస్తోన్నమోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి తలైవా 170 . జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో నటిస్తున్న ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈమూవీ నుంచి అప్ డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఈరోజు ( డిసెంబర్ 12) రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా.. అదరిపోయే అప్ డేట్ ను అందించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తలైవా 170 టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఈసినిమాకు Vettaiyan అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అంతే కాదు సూపర్ స్టార్ అదరిపోయేలా స్టైల్ తో నడిచి వస్తున్న చిన్న వీడియోను కూడా టీజర్ రూపంలో రిలీజ్ చేశారు. బుక్ రీడింగ్ తర్వాత చేతిలో స్టిక్ పట్టుకొని.. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రజినీకాంత్ విజువల్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. అభిమానులకు కనులవిందు చేయడమే కాదు.. సోషల్ మీడియాలో అద్భుతం చేస్తుంది టీజర్ .
ఇంత ఏజ్ వచ్చినా.. అదే స్టైల్.. అదే స్టైల్ మ్యానరిజాన్ని చూపిస్తూ.. స్టైలీష్ ఐకాన్ గా నిలిచాడు రజినీకాంత్. యంగ్ హీరోలకు కూడా పోటీ ఇస్తూ.. సంచలనంగా మారాడు. ఇక ప్రస్తుతుం ఈమూవీ టైటిల్ టీజర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ నుంచి కొన్ని రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ స్టిల్‌ను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. తలైవా 170 ముంబై షెడ్యూల్ పూర్తయినట్టు కొన్ని రోజుల క్రితం అప్‌డేట్ కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీలో గురు ఫేం రితికా సింగ్ కూడా నటిస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.
తలైవా దీంతోపాటు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్‌సలామ్‌లో కూడా నటిస్తుండగా.. పొంగళ్ 2024 కానుకగా విడుదల కానుంది. రజినీకాంత్ మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు