
ఇక టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు వెంకీ. వెంకటేశ్ నటించిన పాన్ ఇండియా మూవీ సైంధవ్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈక్రమంలో మూవీ ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే విక్టరీ వెంకటేష్ తో పాటు దర్శకుడు, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అండ్ సైథవ టీమ్ అంతా కలిసి రకరకాల ప్రాంతాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈమధ్యే ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజబాడ కనకదుర్గమ్మను సైంధవ్ టీమ్ దర్శించుకున్నారు. ఇక ఈసారి వెంకిమామ గల్లీ క్రికెట్ ఆడిసందడి చేశాడు.
సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆంధ్రాలో తిరుగుతున్నాడు వెంకటేష్.. రీసెంట్ గా సెకండ్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ విజయవాడ వెళ్లారు. అయితే దాంతో పాటు.. గుంటూరు పట్టణంలో కూడా సందడి చేశారు టీమ్. VVIT College, KLU University విద్యార్థుల మధ్య సరదా సరదాగా సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా VVIT టీంతో కలిసి క్రికెట్ ఆడింది వెంకటేశ్ అండ్ శైలేష్ కొలను టీం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మేకర్స్ ఇటీవలే లాంఛ్ చేసిన సైంధవ్ ఫస్ట్ సింగిల్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఇక ఈసినిమాలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే సైంధవ్ పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో షేర్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. సైంధవ్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచుతోంది. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న సైంధవ్ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఇది జనవరి 13న విడుదల కానుంది.