కౌశల్ భార్యపై వ్యాఖ్యలు: దీప్తిని హెచ్చరించిన నాని

By pratap reddyFirst Published 8, Sep 2018, 10:03 PM IST
Highlights

బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్ భార్య గురించి దీప్తి చేసిన వ్యాఖ్యలపై నాని కాస్తా కటువుగా స్పందించారు. వ్యక్తిగత విషయాల వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.

హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్ భార్య గురించి దీప్తి చేసిన వ్యాఖ్యలపై నాని కాస్తా కటువుగా స్పందించారు. వ్యక్తిగత విషయాల వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. ఓ టాస్క్‌ సమయంలో కౌశల్‌ భార్యను ఉద్దేశిస్తూ.. ఇతన్ని ఎలా భరిస్తుందో మహాతల్లి అంటూ దీప్తి వ్యాఖ్యానించింది. 

ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ దీప్తిని నాని సున్నితంగా హెచ్చరించారు . అయితే తను కౌశల్‌ను వ్యక్తిగతంగా ఏమీ అనలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఏదో సరదాగా అన్నట్టుగా చెప్పింది. 


దానిపై కూడా నాని స్పందించారు. ఎవరి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించవద్దని సూచించారు. ఇది అందరికీ చెబుతున్నానని అంటూ సోషల్ మీడియాను కూడా కలిపేశారు.

ఈ వార్తాకథనాలు కూడా చదవండి

బిగ్ బాస్2: కౌశల్ భార్యకి దండం పెట్టాలి.. దీప్తి షాకింగ్ కామెంట్స్!

కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసా..?

బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. ఆ ఇద్దరిలో వెళ్లేదెవరో..?

Last Updated 9, Sep 2018, 11:28 AM IST