ఖరీదైన పెళ్లి నగల కోసం దీపిక మూడు గంటల షాపింగ్!

Published : Nov 04, 2018, 03:39 PM IST
ఖరీదైన పెళ్లి నగల కోసం దీపిక మూడు గంటల షాపింగ్!

సారాంశం

బాలీవుడ్ లో ప్రతి ఏడాది ఒక సెలబ్రెటీ జంట పెళ్లి హడావుడి చర్చనీయాంశంగా మారుతోంది. విరాట్ - అనుష్క మ్యారేజ్ తరువాత సోనమ్ కపూర్ వివాహం గురించి వార్తలు చాలా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు దీపిక పదుకొనె - రణ్వీర్ సింగ్ జోడి కి సంబందించిన విషయాలు కూడా హాట్ టాపిక్ టీగా మారాయి. 

ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఇరు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా దీపికా తన పెళ్లి కోసం ఖరీదైన మంగళ సూత్రాన్ని కొనుగోలు చేసిందట. దాని విలువ దాదాపు 20 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. ముంబైలోని అంధేరి కి చెందిన ఒక ప్రముఖ నగల షోరూమ్ వద్దకు వెళ్లి దీపికా తనకు కావాల్సిన నగలను కొనుగోలు చేసింది. 

షాప్  యజమాని దీపికా కోసం ఒక సమయాన్ని కేటాయించి ఎవరు కూడా లోనికి రాకుండా షెటర్స్ క్లోజ్ చేశారట. దాదాపు మూడు గంటలు దీపికా షాపింగ్ చేసి ఖరీదైన మంగళ సూత్రంతో పాటు మొత్తంగా కోటి రూపాయల విలువైన నగలు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రణ్వీర్ కోసం ఆమె ప్రత్యేకంగా పెళ్లి డ్రెస్ డిజైన్ చేయిస్తున్నట్లు టాక్. ఇటలీలోని లేక్ కోమో వేదికగా ఈ నెల 14,15వ తేదీల్లో ఈ బాలీవుడ్ కపుల్స్ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. 

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య