బన్నీ - త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

By Prashanth MFirst Published Nov 4, 2018, 1:31 PM IST
Highlights

సరైనోడు - డీజే సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నాడు. రచయితగా మారిన దర్శకుడు వక్కంతం వంశీని బన్నీ చాలా నమ్మాడు గాని అతను అనుకున్నంతలో హిట్ ఇవ్వలేకపోయాడు.

సరైనోడు - డీజే సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నాడు. రచయితగా మారిన దర్శకుడు వక్కంతం వంశీని బన్నీ చాలా నమ్మాడు గాని అతను అనుకున్నంతలో హిట్ ఇవ్వలేకపోయాడు. దీంతో రిస్క్ లకు అర్జున్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

చిన్న దర్శకులతో చేయాలనీ అప్పటివరకు ఒక ప్లాన్ వేసుకున్న బన్నీ మళ్ళి నిర్ణయం మార్చుకున్నాడనే టాక్ కూడా వచ్చింది. ఇకపోతే అంతకుముందే త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ ని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా అధికారికంగా దర్శకుడు గాని కథానాయకుడు గాని ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే త్రివిక్రమ్ సన్నహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం నవంబర్ సెకండ్ వీక్ లో సినిమాకు సంబందించిన లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ లో సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించేందుకు బన్నీ సిద్ధంగా ఉన్నట్లు టాక్. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

click me!