చిరు రివ్యూ కు.. ‘దసరా’డైరక్టర్ వీణ స్టెప్ అందుకున్నాడు

Published : Apr 13, 2023, 12:51 PM IST
చిరు రివ్యూ కు.. ‘దసరా’డైరక్టర్ వీణ స్టెప్ అందుకున్నాడు

సారాంశం

 డియర్ నాని దసరా సినిమా చూశాను. అద్భుతమైన చిత్రం. నీ పర్ఫార్మెన్స్ అండ్ మాక్ ఓవర్ తో చంపేశావ్. ఇక దర్శకుడు శ్రీకాంత ఓదెల మొదటి సినిమా అయిన సూపర్ గా తీశాడు.

  నాని,  కీర్తి సురేశ్‌ నటించిన తాజా చిత్రం ‘దసరా’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్‌ అదరగొట్టేశారని అంతటా ప్రశంసలు వచ్చాయి. కలెక్షన్స్ వర్షం కురిసింది. పూర్తి తెలంగాణ యాసలో నాని చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక విమర్శకులు సైతం ‘దసరా’పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌ గురించే అందరూ మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో తాజగా మెగాస్టార్‌ చిరంజీవి ‘దసరా’టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. నాని, కీర్తి సురేశ్‌ల నటనతో పాటు శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌ చాలా బాగుందని కితాబిచ్చాడు. 

‘డియర్‌ నాని.. ‘దసరా’ సినిమా చూశాను. చాగా గొప్ప సినిమా ఇది. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పనితీరు చాలా బాగుంది. అసలు ఇది శ్రీకాంత్‌ ఓదెలకు తొలి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా మహానటి కీర్తి సురేశ్‌ యాక్టింగ్‌ అదిరిపోయింది. దీక్షిత్‌ శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అదిరిపోయింది. మొత్తంగా టీమంతా కలిసి గొప్ప చిత్రాన్ని ఇచ్చారు’అని చిరంజీవి మెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క ట్వీట్ రాగానే  శ్రీకాంత్ ఓదెల, ఎగిరిగంతేసాడు. ఈ ట్వీట్ చిరు పోస్ట్ చేసిన వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల “ఎగురుతున్నా, థాంక్యూ బాస్” అంటూ రిప్లై ఇచ్చాడు. తన చిన్నప్పుడు చిరు ఐకానిక్ స్టెప్ అయిన ‘వీణ స్టెప్’ని వేసిన ఫోటోని కూడా శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. చిరు ట్వీట్ తో శ్రీకాంత్ ఓదెల ఎంత ఎగ్జైట్ అయ్యాడో ఆ ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది.

అలాగే చిరంజీవి... “బ్రిల్లియంట్ ఫిల్మ్ చేశారు, నాని మేకోవర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగోట్టేసావ్, కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా చేశాడు అనే విషయం ఆశ్చర్యపరిచింది, అతని ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ ని అభినందించకుండా ఉండలేము, మహానటి కీర్తి సురేష్ వావ్ అనిపించేలా యాక్ట్ చేసింది, కొత్త కుర్రాడు దీక్షిత్ కూడా బాగా చేశాడు, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ రాకింగ్ గా ఉంది” అంటూ పేరు పేరునా దసరా సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసిన ప్రతి ఒక్కరినీ చిరు స్పెషల్ మేషన్ చేసి మరీ అభినందించాడు. 

మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి వచ్చి సెకండ్ వీక్ లో కూడా సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. వంద కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్ లో  2 మిలియన్ డాలర్లు, సెకండ్ వీక్ లో కూడా మైంటైన్ చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా