చైనాలో వెయ్యి కోట్లు వసూల్ చేసిన దంగల్

Published : Jun 01, 2017, 08:27 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
చైనాలో వెయ్యి కోట్లు వసూల్ చేసిన దంగల్

సారాంశం

చైనాలో వెయ్యి కోట్లు వసూల్ చేసిన దంగల్ ఈ ఘనత సాధించిన తొలి విదేశీ సినిమాగా రికార్డు చైనా వసూళ్లతో బాహుబలి రికార్డును క్రాస్ చేసిన దంగల్

చైనాలో వెయ్యి కోట్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా 'దంగల్‌' రికార్డులకెక్కింది. మరే విదేశీ సినిమాకు సాధ్యం కాని ఈ అరుదైన ఘనతను 'దంగల్‌' తన ఖాతాలో వేసేసుకుంది. వెయ్యి కోట్లు.. అసలు ఇండియాలోనే సాధ్యమయ్యే రికార్డు కాదని, 'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదలకు ముందు అంతా అనుకున్నారు.

'బాహుబలి' టీమ్‌ సైతం, వెయ్యి కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నా, ఆ స్థాయి వసూళ్ళు వస్తాయా? అన్న సందేహంతోనే వుంది. అయితే.. 'బాహుబలి ది కంక్లూజన్‌'  రిలీజై.. మొట్టమొదట వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డులకెక్కింది.

అయితే బాహుబలి రికార్డును క్రాస్ చేసి అంతకుముందెప్పుడో విడుదలైన హిందీ సినిమా 'దంగల్‌', చైనాలో విడుదలయ్యాక మళ్ళీ రికార్డులు షురూ చేసేసింది.

'బాహుబలి' - 'దంగల్‌' రికార్డుల్ని దాటేస్తే, 'దంగల్‌', 'బాహుబలి' రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ఓవరాల్‌గా ఈ పోటీ అద్భుతం. ఈ పోటీ వుంటేనే, ముందు ముందు మరిన్ని సినిమాలు ఈ క్లబ్‌లో చేరడానికి వీలవుతుంది. 

 'దంగల్‌' చైనాలో వెయ్యి కోట్ల వసూళ్ళు సాధించడంతో, 'బాహుబలి ది కంక్లూజన్‌' చైనాలో ఎప్పుడు విడుదలవుతుందా.? అని 'బాహుబలి' అభిమానులు ఎదురుచూస్తున్నారు.

చైనా వసూళ్ళ పుణ్యమా అని, 'బాహుబలి' సృష్టించిన కొన్ని రికార్డుల్ని అతి తక్కువ సమయంలోనే 'దంగల్‌' కొల్లగొట్టేసిన విషయం విదితమే.

మరి బాహుబలి చైనాలో రిలీజై రికార్డులు తిరగరాస్తుందా లేదా చూడాలి.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?