స్టార్ హీరో సినిమా సెట్ లో డాన్సర్ మృతి!

Published : Nov 07, 2018, 04:45 PM IST
స్టార్ హీరో సినిమా సెట్ లో డాన్సర్ మృతి!

సారాంశం

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'విశ్వాసం'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న నూతన చిత్రం 'విశ్వాసం'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శనివారం పుణెలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంధర్భంలో డాన్సర్ ఓ.ఎమ్.శర్వణన్(42) అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.

ఆయనకి వాంతులు కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ శర్వణన్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీరుకెళ్లారు. హీరో అజిత్ సుమారు మూడు గంటల పాటు ఆసుపత్రిలోనే గడిపారు.

శర్వణన్ మరణించారనే వార్త తెలియగానే.. అజిత్ తీవ్ర ఆందోళన చెందారు. మృతదేహాన్ని చెన్నైకి పంపడంలో అజిత్ తనవంతు సహాయం అందించారు. దాదాపు రూ.8 లక్షలు వెచ్చించినట్లు సమాచారం.    

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది