పందిపిల్ల....పిచ్చి కామెడీ (‘అదుగో’ మూవీ రివ్యూ)

By Prashanth M  |  First Published Nov 7, 2018, 3:55 PM IST

రాజమౌళి ఆ మధ్యన 'ఈగ' ప్రధాన పాత్రలో  సినిమా చేసి ఓ సూపర్ హిట్ కొట్టారు. ఆ వెంటనే దోమ అనో గొంగళిపురుగు అనో  సినిమా చేద్దామని చాలా మంది అనుకుని ఉంటారు కానీ..బడ్జెట్ లిమిట్స్, ఇలాంటి సినిమాలకు పడాల్సిన  కష్టం,టెక్నాలిజీ  తలుచుకుని ఎవరూ ధైర్యం చేసిన పాపాన పోలేదు.   


 --సూర్య ప్రకాష్ జోశ్యుల

 

రాజమౌళి ఆ మధ్యన 'ఈగ' ప్రధాన పాత్రలో  సినిమా చేసి ఓ సూపర్ హిట్ కొట్టారు. ఆ వెంటనే దోమ అనో గొంగళిపురుగు అనో  సినిమా చేద్దామని చాలా మంది అనుకుని ఉంటారు కానీ..బడ్జెట్ లిమిట్స్, ఇలాంటి సినిమాలకు పడాల్సిన  కష్టం,టెక్నాలిజీ  తలుచుకుని ఎవరూ ధైర్యం చేసిన పాపాన పోలేదు.   

Latest Videos

undefined

కానీ రవిబాబుని మాత్రం ఈగ వెంటాడినట్లుంది( సుదీప్ ని వెంటాడినట్లు).  కాస్త లేటైనా  అలాంటి సినిమా మొదలెట్టారు. ఆయన మీద కాస్త హాలీవుడ్ ఇన్ఫూలియన్స్ ఎక్కువకదా..పంది ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలు చూసి ఉంటారు. దాంతో ఇదిగో ఇలా పంది ప్రధాన పాత్రలో ఈ సినిమా తీసి మనకందించాడు.   

ఇప్పుడు ఆప్షన్ మన చేతిలో ఉంది..పంది పిల్లను ముద్దెట్టుకోవాలా వద్దా అనేది. అలాగే ఈ చిత్రం ఈగలా వర్కవుట్ అవుతుందా...పందితో రవిబాబు కథేం నడిపారు.. తొలిసారిగా పూర్తి లైవ్‌ 3డీ యానిమేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా  ఏ మేరకు మనవాళ్లను ఆకట్టుకుంటుంది. యానిమేషన్ వర్క్ ఎలా ఉంది వంటి వివరాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే. 

కథ ఏంటి  

గన్నవరంలో  ఉండే చంటి అనే ఓ పిల్లాడు బంటి అనే పందిపిల్లను పెంచుకుంటూంటాడు. హ్యాపీగా తన జీవితం తన చిన్న ప్రపంచంలో గడుపుతున్న ఆ పందిపిల్ల జీవితం ఓ సుముహార్తాన్న ఆపదలో పడుతుంది. ఆ పందిపిల్ల నాలుగు క్రిమినల్ గ్యాంగ్ లకు అవసరం అవుతుంది. దాంతో వాళ్లు వెనకపడటం మొదలెడతారు. 

అవసరం అంటే ఏ కోసుకుతినటానికో అనుకునేరు. అలాంటిదేం కాదు..అందుకోసమే అయితే దీన్నే ఎంచుకోవాల్సిన పనిలేదు. వాళ్ల టార్గెట్ వేరు.   వాళ్లలో రెండు గ్యాంగ్ లకు ఈ పంది పిల్ల పొరపాటున మింగేసిన మెమరీ చిప్ కావాలి. ఆ మెమరీ చిప్ లో ..తాము కబ్జా చేసిన వెయ్యి ఎకరాలకు సంభందించిన డాక్యుమెంట్స్ ఉంటాయి.  దాంతో ఆ చిప్ వాళ్లకు చాలా వాల్యుబల్.   

మరో రెండు గ్రూపులకు ...యానిమల్ రేసింగ్ అనే బిజినెస్ ఉంటుంది.  జంతువులకు పందాలు పెట్టి బెట్టింలు చేసే దందా నడుపుతూంటారు. వాళ్లకు వాళ్ల జ్యోతిష్యుడు... పొట్ట మీద మూడు మచ్చల ఉన్న పందిపిల్ల అయితే రేసులో తప్పకుండా గెలుస్తుందని చెప్తాడు. అప్పుడు వాళ్ల దృష్టి ఈ పందిపిల్లపై పడుతుంది.    

ఈ గ్యాంగ్ లు నాలుగు ఈ పంది పిల్ల వెనక పడటం, అది తెలివితో తప్పించుకోవటంతో తెగ హైరానా పడిపోతూంటారు.ఇది చాలదన్నట్లు ఈ గందరగోళం లోకి ఓ ప్రేమికుల జంట వచ్చి పడుతుంది.  రాజీ (న‌భా), అభిషేక్ (అభిషేక్ వ‌ర్మ‌)అనే ప్రేమికుల చేతుల్లోకి ఈ పందిపిల్ల ఓ కొరియర్ పొరపాటు వ్లల వెళ్లుతుంది. దాంతో ఆ లవర్స్  కూడా రెండు ముఠాల మ‌ధ్య ఇరుక్కుపోతారు.  

ఇక ఈ పందిపిల్ల తన దగ్గర నుంచి వెళ్లిపోయింది అంటూ వెతికే చంటి సెర్చింగ్ ఓ ప్రక్కన. ఇలా ఎవరికి వారే పందిపిల్లను వెతుక్కుంటూ తెరంతా హడావిడిగా అటు నుంచి ఇటు పరుగులు పెడుతూంటారు. ఇంతకీ ఈ పంది పిల్ల తిరిగి తనను కావాలనుకుంటున్న చంటి దగ్గరకు ఎలా చేరింది..ఫైనల్ గా ఆ గ్యాంగ్ లు ఏమయ్యారు  అనేదే తెరపై చూడాల్సిన మిగతా కథ. 

ఎలా ఉంది  

పైన రాసిన  కథ చదివిన వారికి ఈ సినిమా ఎలా ఉంటుందో అర్దమై ఉంటుంది. పంది పిల్ల వెనక అందరూ పడతారు..ఛేజ్ చేస్తారు అదే సినిమా అని..అయితే ఇది సినిమాలో ఓ  చిన్న ఎపిసోడ్ అయితే ఏ సమస్యా లేదు. అదే సినిమా అంతా అంటే ఎంతసేపు ఉన్నా తరగదు ఏంటిరా బాబూ అనిపిస్తుంది. 

దానికి తోడు ఆ పందిపిల్ల వెనకబడే గ్యాంగ్ లకు సంభందించిన వాళ్లంతా రవిబాబు తప్ప అంతా కొత్తవారే. దాంతో అసలు ఏ గ్యాంగ్ వస్తోందో..ఏ గ్యాంగ్ ఎగ్జిట్ అవుతుందో ఎక్కడా ఆనవాలు దొరకదు. తెరపై వాళ్లు వెళ్లగానే వీళ్లు ..వీళ్లు వెళ్లగానే వాళ్లు అన్నట్లు అనిపిస్తుంది. ఎక్కడా ఫన్ అనేది పుట్టనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా అనిపిస్తుంది.  

అదే రాజమౌళి ఈగలో అయితే ఓ విలన్ ..వాడిని ఎదుర్కొనే ఓ ఈగ. ఆ ఈగతో ఓ మోటివ్ స్పష్టంగా ఇవ్వబడుతుంది. ఆ విలన్ ని ఎదుర్కొనే క్రమం..ఎత్తులు పై ఎత్తులు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అదే ఈ సినిమాకు వచ్చేసరికి మిస్ అయ్యింది. విలన్స్ కు టార్గెట్ ఉంటుంది. దాంతో పందిపిల్లకు లక్ష్యం..తను వాళ్ల నుంచి తప్పించుకోవటమే అయ్యింది. దాంతో పంది పిల్ల హీరో అవటానికి ఎక్కడా అవకాసం లేకుండా పోయింది.  

కొత్తేం కాదు  

ఇక ఈ నేరేషన్ ఏమన్నా కొత్తదా అంటే అంత సీన్ లేదు.  స్వామి రారా, దొచేయ్, కో అంటే కోటి.. , శ‌మంతక‌మ‌ణి ..ఇవన్నీ ఆ బాపతు సినిమాలే. వీటిలో స్వామి రారా ఫెరఫెక్ట్ డిజైన్ తో ఉంటుంది. అందుకే ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడీ అదిగో మిగతా వాటి సరసన చేరింది.   

పిల్లలకు నచ్చుతుందా  

పందిపిల్ల ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కదా అని ఆవేశపడి పిల్లలను తీసుకువెళ్తే ..వాళ్లకి విసుగొచ్చి..మనని విసుగెత్తించేస్తారు.  

ఇది కామెడీనా  

ఇంతకు ముందు రవిబాబు..పార్టి అనే టేస్ట్ లెస్ వరస్ట్ కామెడీ చేసారు. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి ప్రయత్నమే చేసాడనిపిస్తుంది. పందిపిల్లతో చేసిన కొన్ని సీన్స్ జుగుప్సగా ఉంటాయి. పందిపిల్లతో లిప్  కిస్ లు ఇప్పించటమే సీన్ చాలు ఈ సినిమా ఏ స్దాయిలో ఉందో చెప్పటానికి. ఒక క్యారక్టర్ ఏంటో ప్రతీ వారిపై ఉమ్ము వేస్తూంటుంది. మరొక పాత్ర బూతులుతో రెచ్చిపోతూంటుంది. పరాకాష్ట చెప్పాలంటే ఆ పందికి ఆముదం తాగించి ..తద్వారా టాయిలెట్ కు తీసుకెళ్లి తన చిప్ ను తీసుకోవాలనే ఆలోచన లోంచి పుట్టిన సీన్ .. ద్యావుడా..పారిపోవాలనిపిస్తుంది.  

టెక్నికల్ గా   

ఈ సినిమాలో సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నది లైవ్ యానిమేష‌న్ , విజువ‌ల్ ఎఫెక్ట్స్‌. కెమెరా వర్క్ హైలెట్ గా ఉంది. పాటలు బాగోలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  

 ఫైనల్ ధాట్  

ఈగ క్రేజ్ తో ..రకరకాల భాషల్లో ఈ సినిమాని డబ్ చేసి అమ్మేసి ఉండవచ్చు కానీ..ఏ భాష వారైనా.. పందులను పెంచుకునేవారైనా ఈ సినిమాని అయితే  హర్షించరు. 

 

రేటింగ్:  1/5 

 

తెర వెనక, ముందు

తారాగణం: అభిషేక్ వర్మ, నాభ నటేష్, రవి బాబు, టి. ఉద్య భాస్కర్, ఆర్ కె. వీరేందర్ చౌదరి తదితరులు 

 స్క్రీన్ ప్లే: సత్యానంద్, డై

లాగ్స్: రవి బాబు, నివాస్, 

లిరిక్స్: భాస్కర్ భట్ల, 

మేకప్: దొడ్డి శ్రీనివాస్, 

కొరియోగ్రాఫర్: ప్రసన్నా, 

యాక్షన్: కనల్ కన్నన్, విజయ్, సతీష్, 

ఆర్ట్: నారాయణ రెడ్డి, 

ఎడిటర్: పల్లా సత్యనారాయణ, 

కెమెరా: సుధాకర్ రెడ్డి, 

మ్యూజిక్: ప్రశాంత్ విహారి, 

కథ-నిర్మాత-దర్శకత్వం: రవి బాబు

సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్ 

నిర్మాణం : ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ఎంటర్ టైన్మెంట్ 

విడుదల :  నవంబర్ 7, 2018

 

 

click me!