ప్రియురాలితో యశ్వంత్ మాస్టర్ పెళ్లి!

Published : Apr 28, 2019, 02:28 PM ISTUpdated : Apr 28, 2019, 02:31 PM IST
ప్రియురాలితో యశ్వంత్ మాస్టర్ పెళ్లి!

సారాంశం

టాలీవుడ్ కొరియోగ్రాఫర్, 'ఢీ' ఫేమ్ యశ్వంత్ మాస్టర్ వివాహం శనివారం నాడు వైభవంగా జరిగింది.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్, 'ఢీ' ఫేమ్ యశ్వంత్ మాస్టర్ వివాహం శనివారం నాడు వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా తన స్నేహితురాలి ప్రేమలో ఉన్న ఆయన ఇప్పుడు ఆమెను తన భార్యగా చేసుకున్నారు.

ఈ విషయం గురించి యశ్వంత్ మాట్లాడుతూ.. ''వర్ష నా చిన్నప్పటి స్నేహితురాలు, కాలేజ్ మెట్. ఎనిమిది సంవత్సరాల నుండి మా మధ్య స్నేహం ఉంది. జీవితంలో సెటిల్ అయిన తరువాత ఇద్దరి ఇంట్లో చెప్పాలనుకున్నాం. ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్ లో వారు సెటిల్ అయ్యాం. కాబట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి బంధంతో ఒక్కటైంది ఈ జంట. వర్ష ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తుందని యశ్వంత్ తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్