హిజ్రాగా మెగాస్టార్..?

Published : Apr 28, 2019, 12:03 PM IST
హిజ్రాగా మెగాస్టార్..?

సారాంశం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం అందుకున్న 'కాంచన' చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.

ఈ సినిమాకి 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాతో రాఘవ లారెన్స్ బాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుండి. ఈ సినిమాలో అక్షయ్ కి జోడీగా కియారా అద్వానీ నటించనుంది.

అయితే 'కాంచన' సినిమాలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ హిజ్రా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీమేక్ లో ఆ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన లేదు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ