సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన బాలకృష్ణ.. సెలబ్రిటీల క్యూ.. ప్రత్యేకత ఏంటంటే?

Published : Dec 30, 2023, 06:35 PM IST
సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన బాలకృష్ణ.. సెలబ్రిటీల క్యూ.. ప్రత్యేకత ఏంటంటే?

సారాంశం

హీరో నందమూరి బాలకృష్ణ.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. శనివారం ఆయన సీఎం క్యాంప్‌ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిశారు. 

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయి ఇరవై రోజులు దాటింది. ఈ నేపథ్యంలో ఆయనకు అభినందనల వెల్లువ సాగుతుంది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రత్యక్షంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు, ఆయన ప్రభుత్వానికి స్వయంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. 

ఇక శనివారం ఉదయం నాగార్జున ఫ్యామిలీ కలిసింది. తన భార్య అమలతో కలిసి నాగార్జున.. సీఎంని కలవడం విశేషం. పుష్ప గుచ్చం ఇచ్చి కాసేపు మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. వీరి మధ్య సినిమా ఇండస్ట్రీతోపాటు బిగ్ బాస్‌ వ్యవహారం, ఇతర వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ కూడా సీఎంని కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని క్యాంప్‌ ఆఫీసులో కలిసి  అభినందించారు. బాలకృష్ణతోపాటు ఆయన అల్లుడు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు ఉన్నారు. 

ఇదిలా ఉంటే సీఎం రేవంత్‌ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యేగా కొన్నాళ్లపాటు సేవలందించారు. ఆ సమయంలో బాలకృష్ణతో రేవంత్‌రెడ్డికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రభుత్వం మారినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిని, సీఎంని కలవడం కామన్‌గా జరిగేదే. అందులో భాగమే ఇదంతా అని చెప్పొచ్చు. అదే సమయంలో తమ వ్యక్తిగత పనులను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లడం, వాళ్లతో చర్చించడం జరుగుతుంటుంది. దీంతో ఇప్పుడు వీళ్లు ఎందుకు కలిశారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

కాగా బాలయ్య.. ఈ ఏడాది `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?
Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌