Bheemla Nayak: భీమ్లా నాయక్ రన్ టైం పై క్రేజీ అప్డేట్!

Published : Jan 25, 2022, 02:43 PM IST
Bheemla Nayak: భీమ్లా నాయక్ రన్ టైం పై క్రేజీ అప్డేట్!

సారాంశం

సంక్రాంతికి రావాల్సిన భీమ్లా నాయక్ (Bheemla Nayak)అనుకోని కారణాల వలన వెనక్కిపోయింది. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా... ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 

2022 సంక్రాంతి విడుదలకు భీమ్లా నాయక్ సర్వం సిద్ధమైంది. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)నిర్మాతల ఒత్తిడితో ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయడం ఫ్యాన్స్ తో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ససేమిరా ఇష్టం లేదు. అందుకే భీమ్లా నాయక్ విడుదల వాయిదా వార్తలను ఖండించుకుంటూ వచ్చారు. పెద్దల ప్రమేయంతో చివరకు వాయిదా వేయడం తప్పలేదు. భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటున్నట్లు న్యూస్ వచ్చిన వెంటనే ఫ్యాన్స్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. 

తీరా చూస్తే ఏ ఆర్ ఆర్ ఆర్ కోసమైతే భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేశారో.. అది కూడా సంక్రాంతికి విడుదల కాలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా ఆంక్షలు అమలులోకి రావడం జరిగింది. చేసేది లేక ఆర్ ఆర్ ఆర్ టీం మూవీని వాయిదా వేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్ట్ ఫోన్ అయినప్పటికీ భీమ్లా నాయక్ ని ముందుకు తెచ్చే ఆలోచన నిర్మాతలు చేయలేదు. ఫిబ్రవరి 25కే కట్టుబడి ఉన్నారు. ఈ నిర్ణయం బంగార్రాజు చిత్రానికి ప్లస్ అయ్యింది. 

అయిందేదో అయ్యింది.. ఇకపై వాయిదా వేయకుండా చెప్పినట్లు ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా భీమ్లా నాయక్ గురించి ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. భీమ్లా నాయక్ మూవీ రన్ టైం చాలా తక్కువగా ఉండనున్నట్లు సమాచారం. కేవలం రెండు గంటల పదినిమిషాల రన్ టైం మాత్రమే భీమ్లా నాయక్ కలిగివున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి తెలుగు రీమేక్. ఒరిజినల్ మూవీ కంటే తక్కువ నిడివి భీమ్లా నాయక్ కలిగి ఉంటుందట. 

ఇద్దరు స్టార్ హీరోలు (Pawan kalyan) కలిసి నటించిన భీమ్లా నాయక్ మూవీ రన్ టైమ్ ఇంత తక్కువుగా ఉండడం ఆసక్తి గొలిపే అంశమే. ఇక ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ చూసిన టాలీవుడ్ వర్గాలు అద్భుతం అంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు. దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. థమన్ సంగీతం అందించారు. భీమ్లా నాయక్ మూవీలో పవన్ కి జంటగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం