Mohan Babu:త్రివిక్రమ్ సినిమాలో మోహన్ బాబు! ఏ పాత్రకి అంటే...

Surya Prakash   | Asianet News
Published : Jan 25, 2022, 02:30 PM IST
Mohan Babu:త్రివిక్రమ్ సినిమాలో మోహన్ బాబు! ఏ పాత్రకి అంటే...

సారాంశం

 సూర్య హీరోగా రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సీనిమాల్లో ఓ పాత్రలో కనిపించడం మినహా ఈ మధ్య చెప్పుకోదగ్గ  సినిమా లేదు.  అయితే ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు త్రివిక్రమ్ సంప్రదించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


 గత 46 ఏళ్లుగా ఇండస్ట్రీలో నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు మోహన్ బాబు. 500 కు పైగా చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రాల్లో నటించి మెప్పించారు మోహన్ బాబు. నిర్మాతగా 50కు పైగా సినిమాల్లో తీశారు. అయితే వయస్సు మీద పడటం వలనో మరే కారణాలవల్లో కానీ ఆయన హవా తగ్గింది. ఆయన తెరపై కనిపించటం తగ్గించారు.

ఓరకంగా చెప్పాలంటే మోహన్ బాబు ప్రస్తుతం సెమి రిటైర్ మెంట్ స్టేజీలో ఉన్నారు. సూర్య హీరోగా రూపొందిన ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సీనిమాల్లో ఓ పాత్రలో కనిపించడం మినహా ఈ మధ్య చెప్పుకోదగ్గ  సినిమా లేదు.  అయితే ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు త్రివిక్రమ్ సంప్రదించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
 
తన ప్రతి సినిమాలో ఒక పేరొందిన నటుడిని విలన్ గానో, కీలకమైన పాత్రకోసమో తీసుకుంటూ వస్తున్నారు  త్రివిక్రమ్. అత్తారింటికి దారేది సినిమాలో తాత పాత్రకి బొమన్ ఇరానీని బాలీవుడ్ నుంచి రప్పించారు. ఇప్పుడు సీనియర్ నటుడు మోహన్ బాబుకి కూడా ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారు అని టాక్.  మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే కొత్త సినిమాలో మెయిన్ రోల్ కోసం మోహన్ బాబుని అడిగినట్లు  చెప్పుకుంటున్నారు. ఆ పాత్ర మహేష్ బాబు తండ్రి అంటున్నారు. మోహన్ బాబు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు.

ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. ఈ మూడో చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో మొదలు కానుంది. హీరోయిన్ గా పూజ హెగ్డే కన్ఫర్మ్ అయింది. మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ పరిశీలనలో ఉందని చెప్పుకుంటున్నారు.

ఇక మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా 'సన్నాఫ్ ఇండియా' రూపొందుతోంది. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో, విరూపాక్ష పాత్రలో మోహన్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇళయారాజా సంగీతాన్ని సమకూర్చారు.

 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?