Chiranjeevi: 16 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో జతకట్టబోతున్న త్రిష.. ఏ సినిమాలోనంటే..?

Published : Jan 25, 2022, 02:23 PM ISTUpdated : Jan 25, 2022, 02:26 PM IST
Chiranjeevi: 16 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో జతకట్టబోతున్న త్రిష..  ఏ సినిమాలోనంటే..?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) దూకుడు చూపిస్తున్నారు. వరుసగా సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ... హడావిడి చేస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికే ఆరు సినిమాల వరకూ లైన్ అప్ చేసిన మెగాస్టార్ జతగా త్రిష(Trisha) నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) దూకుడు చూపిస్తున్నారు. వరుసగా సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ... హడావిడి చేస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికే ఆరు సినిమాల వరకూ లైన్ అప్ చేసిన మెగాస్టార్ జతగా త్రిష(Trisha) నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య  సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా చేస్తూనే మలయాళ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను సెట్స్ఎక్కించాడు చిరు. ఈసినిమా తరువాత వరుసగా  'భోళా శంకర్' వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు  లైన్ లో ఉన్నాయి. దీంతో పాటు మెగాస్టార్(Megastar Chiranjeevi)   వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు.

కంప్లీట్  కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కబోతున్న ఈసినిమాకు సబంధించిన పనులు చకచకా చేసుకుంటున్నాడట డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula). చిన్నతనం నుంచి మెగాస్టార్ అభిమానిగా పెరిగిన తనకు .. తను దేవుడిలా కొలిచే స్టార్ హీరోనే డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో.. దిల్ ఖుష్ అవుతున్నాడు వెంకీ. ఇక ఈసినిమాకు సబంధించి మిగతా తారాగణం, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకు  హీరోయిన్ గా ముందు  శ్రుతిహాసన్(Shruthi Hasan) ను అనుకున్నారట. కాని అది కుదరక పోవడంతో మరో హీరోయిన్ ఎవరు అనుకున్న టైమ్ లో ఈ టీమ్ కు త్రిష(Trisha) గుర్తుకు వచ్చింది. అయితే..  త్రిషను ఎంపిక చేయడందాదాపు యిపోయినట్టే అని తెలుస్తోంది. చిరంజీవి(Megastar Chiranjeevi)  సరసన త్రిష గతంలో కూడా నటించింది. 2006లో వచ్చిన స్టాలిన్ చిత్రంలో ఆమె మెరిసింది. ఆ తర్వాత మళ్లీ పదహారేళ్లకు చిరు సరసన ఆమె మరోసారి నటించనుంది.

త్రిష(Trisha)ను గతంలో కూడా ఓ సారి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)  సినిమాకు తీసుకున్నారు. చింరంజీవి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీలో త్రిషను ముందు హీరోయిన్ గా తీసుకున్నారు. కాని మైందో ఏమో.. షూటింగ్స్ టైమ్ ఏదో జరిగి.. క్రియేటీవ్ డిఫరెన్సెస్ వల్ల.. సినిమా నుంచి తాను తప్పుకుంటున్నాను అని ప్రకటించింది త్రిష. ఆతరువాత ఈసినిమా కోసం కాజల్(Kajal) ను ఎంపిక చేశారు. ఇక ఇన్నాళ్లకు మళ్లీ త్రిష మెగాస్టార్ తో జతకట్టబోతున్నట్టు తెలుసోతంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా