
ప్రపంచ సినిమా అభిమానులకు క్రేజీ ట్రీట్ ఇవ్వబోతున్నారు అవతార్2 టీమ్. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ హాలీవుడ్ మూవీ నుంచి ట్రైలర్ ట్రీట్ కు రెడీ అవుతున్నారు కామెరూన్ బ్యాచ్.
అవతార్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల్ని పండారా గ్రహంలోకి తీసుకెళ్లిన జేమ్స్ కామెరూన్ ఇప్పుడు అవతార్ 2 తో మరోసారి మనల్ని మెస్మరైజ్ చేయటానికి రెడీ అవుతున్నారు. ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమా షూటింగ్ చివరి స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం తుది దశ లో మెరుగులు దిద్దుకుంటుంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాబోతున్న అవతార్2 నుంచి భారీ అప్ డేట్ రాబోతుంది.
ప్రేక్షకులను సరికొత్త రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి..బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది అవతార్. సినీ లవర్స్ కు అద్బుతమైన సినిమాలు అందించిన హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన ఈ వండర్ సినీ వరల్డ్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.ఇక ఈసినిమాకు నాలుగు సీక్వెల్స్ ప్రకటించిన దర్శకుడు వాటి పనుల్లో బిజీగా ఉన్నాడు. కరోనా వల్ల డిలై అవుతూ వస్తున్న ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు మరో భారీ అప్ డేట్ తో టీమ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
అవతార్ 2 ఇపుడు మళ్లీ తెరపైకి వచ్చింది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో అవతార్ 2 ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు హాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మే 6న అవతార్ 2 ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అవతార్ 2 ఇదివరకెన్నడూ లేని వీఎఫ్ఎక్స్ తో ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని కలిగించేలా ఉండనుందట.
అవతార్ కు మరో నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో భాగంగా అవతార్ 2 ని ముందుగా 2021లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో షూటింగ్ ఆలస్యం అయింది. ఆ మధ్య కేసులు తగ్గి యధా స్దితికి వచ్చాక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి న్యూజిలాండ్‌లో మొదలు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్టు తాజాగా జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఫైనల్ గా 2022 డిసెంబరులో అవతార్ 2 రిలీజ్ కానుంది.