మహోజ్వాల సాంస్కృతిక కళా మహోత్సవాలను విజయవంతం చేద్దాంః చిరంజీవి

Published : Mar 23, 2022, 01:58 PM IST
మహోజ్వాల సాంస్కృతిక కళా మహోత్సవాలను విజయవంతం చేద్దాంః చిరంజీవి

సారాంశం

`రాష్ట్రీయ సాంస్కృతీ మహోత్సవ్‌`ని  ఈ నెల 26 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల్లో ప్రదర్శించబోతుండగా ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి  తెలిపారు. 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 12వ ఎడిషన్‌ `రాష్ట్రీయ సాంస్కృతీ మహోత్సవ్‌(Rashtriya Sanskriti Mahostav) జాతీయ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ సారి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మూడు ఏరియాల్లో ప్రదర్శించబోతుండటం విశేషం. తాజాగా ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు. 

ఇందులో చిరంజీవి చెబుతూ, `భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే దేశం మన భారతదేశం. ఆ మహోన్నత సాంస్కృతిని ప్రతిబింబించేలా జాతీయ సాంస్కృతిక మహోత్సవాన్ని భారత ప్రభుత్వం ఈ సారి మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండటం ఆనందంగా ఉంది. మన దేశ ఘన వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వివిధ రకాల సాంస్కృతిక కళారూపాలను, ఎందరో కళాకారులు రాజమండ్రిలో మార్చి 26, 27 తేదీల్లో, వరంగల్‌లో 29, 30న, హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 1, 2, 3 తేదీల్లో ప్రదర్శిస్తారు. ఈ మహోజ్వాల సాంస్కృతిక కళా మహోత్సవాలను తిలకిద్దాం. దాన్ని విజయవంతం చేద్దాం. మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో మనందరం భాగస్వాములమవుదాం` అని వెల్లడించారు. 

ఇదిలా ఉంటే ఈ వేడుకలకు గెస్ట్ గా అటెండ్‌ కావాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. చిరంజీవిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో స్వయంగా చిరంజీవిని కలిసి ఆహ్వానించారు మంత్రి కిషన్‌రెడ్డి. ఆ సందర్భంగా చిరంజీవి చెబుతూ, `హైదరాబాద్‌లో ఏప్రిల్ 1-3 జరగనున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 12వ ఎడిషన్ 'రాష్ట్రీయ సాంస్కృతీ మహోత్సవ్' జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానాన్ని అందించినందుకు కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు చిరు. 

ఉగాది రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద & గిరిజన కళలు, నృత్యం, సంగీతం, వంటకాలు & సంస్కృతిని ప్రదర్శించే & ప్రచారం చేసే ఈ ఉత్సవంలో చేరడం నా అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.  మన దేశంలోని కళాకారులు & చేతివృత్తుల వారి జీవనోపాధికి తోడ్పడేందుకు గొప్ప వేదికను అందిస్తుంది` అని చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌ 29న విడుదల కాబోతుంది. మరోవైపు `గాడ్‌ ఫాదర్‌`, `భోళా శంకర్‌`, `మెగా154` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. మరోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఓ సినిమాకి కమిట్‌ అయ్యారు చిరు. యంగ్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ యంగ్‌ స్టర్స్ కి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి