john Abraham Comment: హాలీవుడ్ అబ్బురపడేలా మన సినిమా: జాన్ అబ్రహాం

Published : Mar 23, 2022, 01:54 PM IST
john Abraham Comment: హాలీవుడ్ అబ్బురపడేలా మన సినిమా: జాన్ అబ్రహాం

సారాంశం

మన ఇండియన్ సినిమాలకు ఏ సినిమాలుసాటిరావు అంటున్నాడు బాలీవుడ్ రొమాంటిక్ హీరో జాన్ అబ్రహాం. విదేశీయు కూడా అబ్బుర పడేలా మన సినిమా స్థాయి పెరిగిందన్నారు.   

మన ఇండియన్ సినిమాలకు ఏ సినిమాలుసాటిరావు అంటున్నాడు బాలీవుడ్ రొమాంటిక్ హీరో జాన్ అబ్రహాం. విదేశీయు కూడా అబ్బుర పడేలా మన సినిమా స్థాయి పెరిగిందన్నారు. 

విదేశీయులు మన సినిమాలను చూసి ప్రశంసించాలి..భారతీయులు ఇలాంటి సినిమాలు చేయగలిగారు భళా అంటూ అనుకోవాలి అంటున్నారు బాలీవుడ్‌ స్టార్ హీరో జాన్‌ అబ్రహాం. ఆయన నటిస్తున్న కొత్త సినిమా అటాక్‌. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ డైరెక్ట్ చేస్తన్న ఈసినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌  హీరోయిన్లు గా నటించారు.త్వరలో రిలీజ్ కాబోతున్న ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  

ఇక ఈసినిమా ట్రైలర్‌ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఉగ్రవాదంపై పోరాడేందుకు శాస్త్రవేత్తలు రోబో సైనికుడిని రూపొందించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయోగాల్లో భాగమైన ఓ యువకుడి కథే అటాక్‌. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్  సందర్భంగా జాన్‌ అబ్రహాం మాట్లాడుతూ…మనం ‘అవేంజర్స్‌ లాంటి హాలీవుడ్‌ సూపర్‌ హీరో సినిమాలు చూస్తుంటాం. మనమూ అలాంటి సినిమాలను తెరకెక్కించవచ్చు అన్నారు. కొంతలో కొంత తాను ఇప్పుడు చేసిన అటాక్‌ సినిమా అలాంటి ప్రయోగమే అన్నారు జాన్.  

మన సినిమాలు  చూసి విదేశీయులు సైతం అబ్బురపడాలి. హాలీవుడ్ కూడా హౌరా అనగలిగే సినిమాలు చేసే సత్తా మనకు ఉంది అన్నరు జాన్ అబ్రహాం. చెడ్డ  సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా రిజల్ట్ మంచిగా ఉండదన్నారు జాన్ అబ్రహాం. నా కెరీర్‌లోనూ ఇది అనుభవమే. కానీ ఇది మంచి సినిమా అని చెప్పగలను అన్నారు. ఇక  ఏప్రిల్‌ 1న అటాక్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మగాడితో నా అవసరం ఇదే.. ఒంటరిగా ఉండటమే ఇష్టం.. చిరంజీవి హీరోయిన్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Anchor Suma: నీకు టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు.. నేను ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే...