సమంత ‘యశోద’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కు డేట్, టైం ఫిక్స్..

Published : May 03, 2022, 04:21 PM IST
సమంత ‘యశోద’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కు డేట్, టైం ఫిక్స్..

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తున్న చిత్రం ‘యశోద’. ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అయితే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.   

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ‘యశోద’ (Yashoda) రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి హరిశంకర్ మరియు హరీశ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యశోద అనే పాత్రలో సమంత రుత్  ప్రభు నటిస్తోంది. అలాగే ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ పాన్ ఇండియన్ చిత్ర షూటింగ్ ను గతేడాది డిసెంబర్ లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఈ మూవీ చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కొంత భాగం యాక్షన్స్ సీక్వెల్స్ ను కూడా చిత్రీకరించారు. ఈ నెలాఖరు కల్లా చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి కానుంది. తొలిసారి డిఫరెంట్ జానర్ లో సమంత నటిస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం  కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సెట్ కు సంబంధించిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 
కాగా, ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను అందించారు మేకర్స్. ఇప్పటికే చిత్రం రిలీజ్ ను డేట్ ను  అనౌన్స్ చేయగా.. తాజాగా ‘యశోద’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 5న ఉదయం 11:07 నిమిషాలకు ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్  గ్లింప్స్ విడుదల కానుంది. దీంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఆగస్టు 12న ‘యశోద’ చిత్రాన్ని అన్ని  భాషల్లో రిలీజ్ చేయనున్నారు.  

ఇక చివరిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రంలో నటించింది. కేవలం స్పెషల్ సాంగ్ లేనే నటించి ‘ఊ అంటవా మావా.. ఊఊ అంటావా మావా’ చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది సమంత. ఆ క్రేజ్ తోనే తన పాన్ ఇండియన్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. తను నటిస్తున్న మరో చిత్రం ‘శాకుంతలం’. అలాగే విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణలో వస్తున్న తాజా చిత్రంలోనూ సమంత హీరోయిన్ గా నటించనుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా