
కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి (Chiranjeevi) చిత్రాల్లో రవితేజ చిన్న చిన్న పాత్రలు చేశారు. అన్నయ్య మూవీలో ఇద్దరు తమ్ముళ్లలో ఒకడిగా రవితేజ ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. రవితేజ స్టార్ హోదా తెచ్చుకున్నాక చిరంజీవితో నటించలేదు. అయితే దర్శకుడు బాబీ తన మూవీ కోసం ఈ కాంబినేషన్ సెట్ చేశారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి 154(Mega 154) వ చిత్రం తెరకెక్కుతుంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ కీలక రోల్ కోసం రవితేజను అనుకున్నారు. ఈ పాత్ర చేయడానికి రవితేజ ఒప్పుకోవడం కూడా జరిగింది. దీంతో విశ్వసనీయ సమాచారం బయటకొచ్చింది.
అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం రవితేజ(Raviteja)ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారట. కారణం ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. రవితేజ ఏకంగా రూ. 16 కోట్లు అడుగుతున్నారట. అది దాదాపు రవితేజ ఫుల్ టైం రెమ్యూనరేషన్ తో సమానం. సినిమాకు రవితేజ రెమ్యూనరేషన్ రూ. 20 కోట్లు లోపే. అలాంటిది ఆయన గెస్ట్ రోల్ కోసం అన్ని కోట్లు అడగడంతో మేకర్స్ వెనక్కి తగ్గారట. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే మరో హీరోని వెతికే పనిలో పడ్డారట. చిరంజీవి మూవీ నుండి రవితేజ తప్పుకోవడం అధికారికమే అని గట్టిగా వినిపిస్తోంది.
క్రాక్ మూవీతో రవితేజ కమ్ బ్యాక్ అయ్యారు. చాలా కాలం తర్వాత ఓ క్లీన్ హిట్ అందుకున్నాడు. అయితే వెంటనే ఓ ప్లాప్ పడింది. ఆయన లేటెస్ట్ మూవీ ఖిలాడి డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ దర్శకుడు రమేష్ వర్మతో రవితేజకు అనేక గొడవలు జరిగాయి. క్రాక్ హిట్ తో రవితేజకు విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని తెలిసిన రవితేజ కాదనకుండా అన్నింటికీ సైన్ చేశారు.
రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు రవితేజ చేస్తున్న సినిమాల లిస్ట్. ఈ సినిమాలో రవితేజ కనీసం రూ. 80 కోట్ల వరకు ఆర్జించారు. ఈ సినిమాల ఫలితం ఎలా ఉన్నా రవితేజ ఆర్థికంగా లాభపడ్డారు. వీటిలో ఒక్క సినిమా ఆడినా ఆయన కెరీర్ కి కొన్నాళ్లు మరలా కొదవ ఉండదు. టూ టైర్ హీరోల కెరీర్ కి లాంగ్ రన్ ఉండదు. శ్రీకాంత్, జగపతిబాబు మాదిరి ఓ దశ తర్వాత వాళ్ళ సినిమాలు ఎవరూ చూడరు. రవితేజ అందుకే క్రేజ్ ఉన్నంత కాలం తీరిక లేకుండా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో రెమ్యునరేషన్ విషయంలో పక్కాగా ఉంటున్నారు.