Chiranjeevi: అలసిపోయిన చిరు... సతీసమేతంగా అలా వరల్డ్ టూర్ ప్లాన్ చేశారు!

Published : May 03, 2022, 02:46 PM IST
Chiranjeevi: అలసిపోయిన చిరు... సతీసమేతంగా అలా వరల్డ్ టూర్ ప్లాన్ చేశారు!

సారాంశం

 చిరంజీవి భార్య సురేఖతో పాటు వరల్డ్ టూర్ ప్లాన్ చేశారు. ఈ జంట ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో విహరించనున్నారు. యూఎస్ఏ తో పాటు యూరప్ వీరి వెకేషన్ సాగనుంది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.    

67 ఏళ్ల చిరంజీవి (Chiranjeevi)తీరిక లేకుండా గడుపుతున్నారు చిరంజీవి. ఆచార్య మొన్నటి వరకు ఆచార్య ప్రమోషన్స్ నిర్వహిస్తూనే మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నారు. చిరంజీవి హీరో మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ తో పాటు మెహర్ రమేష్ భోళా శంకర్, దర్శకుడు బాబీ దర్శకత్వంలో 154వ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వయసులో ఉన్న హీరోలు రెండేళ్లకు ఓ మూవీ చేస్తుంటే చిరంజీవి ఏక కాలంలో మూడు చిత్రాలు పూర్తి చేస్తున్నారు. ఆచార్య విడుదల కావడంతో ఆయన కొంచెం విరామం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. 

చిరంజీవి భార్య సురేఖతో పాటు వరల్డ్ టూర్ ప్లాన్ చేశారు. ఈ జంట ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో విహరించనున్నారు. యూఎస్ఏ తో పాటు యూరప్ వీరి వెకేషన్ సాగనుంది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. భార్య సురేఖతో పాటు విమానంలో ప్రయాణం చేస్తున్న ఫోటో షేర్ చేశారు. కరోనా పరిస్థితుల తర్వాత మొదటిసారి వరల్డ్ టూర్ కి వెళుతున్నట్లు చిరంజీవి కామెంట్ చేశారు. వెకేషన్ నుండి వచ్చిన వెంటనే చిరంజీవి మరలా షూటింగ్స్ లో పాల్గొననున్నారు.

 
మరోవైపు ఆచార్య (Acharya)అనూహ్యంగా పరాజయం పాలైంది. నాలుగో రోజుకే ఆచార్య థియేటర్స్ నుండి వెళ్ళిపోతుంది. చిరంజీవి కెరీర్ లోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఆచార్య ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తుంది.సినిమా ఆడుతున్న థియేటర్స్ వైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదు. రెండో రోజే ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో ఆచార్య థియేటర్స్ ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలకు మళ్లించేశారు. రెండో రోజు ఆచార్య షేర్ సింగిల్ డిజిట్ కి పడిపోగా... మూడో రోజు కోటి, నాలుగో రోజుకు లక్షల్లోకి వచ్చేసింది. ఎంత నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ రేంజ్ డిజాస్టర్ ఊహించనిదే. 

 

  ప్రేక్షకులు రాక షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. వీకెండ్ ముగియకుండానే షోలు క్యాన్సిల్ కావడం దారుణమైన పరిణామం. దాదాపు రూ. 150 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆచార్య నాలుగు రోజులకు కేవలం రూ. 44.5 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. రంజాన్ సెలవు దినం  ఆచార్యకు ఊపిరిపోసే అవకాశం కలదు. మొత్తంగా ఆచార్య రన్ థియేటర్స్ లో ముగిసింది. 

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్