Bigg Boss Telugu 5: సన్నీ Vs షణ్ముఖ్.. శృతి మించిపోయిన ఫ్యాన్స్ వార్, చేతులు జోడించి వేడుకుంటోంది

pratap reddy   | Asianet News
Published : Nov 28, 2021, 05:21 PM IST
Bigg Boss Telugu 5: సన్నీ Vs షణ్ముఖ్.. శృతి మించిపోయిన ఫ్యాన్స్ వార్, చేతులు జోడించి వేడుకుంటోంది

సారాంశం

బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకునే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. టాప్ 5 ఎవరనే ఉత్కంఠ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో రోజు రోజుకు పెరిగిపోతోంది. అలాగే ఇద్దరు ఫైనలిస్టులు ఎవరు ? విజేత ఎవరు ? అనే ప్రశ్నలపై కూడా అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకునే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. టాప్ 5 ఎవరనే ఉత్కంఠ బిగ్ బాస్ ప్రేక్షకుల్లో రోజు రోజుకు పెరిగిపోతోంది. అలాగే ఇద్దరు ఫైనలిస్టులు ఎవరు ? విజేత ఎవరు ? అనే ప్రశ్నలపై కూడా అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఫ్యాన్స్ గ్రూపులు ఏర్పడ్డాయి. 

ముఖ్యంగా VJ Sunny.. Shanmukh లకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. టైటిల్ విన్నర్ సన్నీ అని అతడి అభిమానులు.. లేదు షణ్ముఖ్ అంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ మొదలు పెట్టారు. ఊహించని రీతిలో ఈ వార్ హద్దులు దాటుతోంది. ఒకరిపై ఒకరు నెగిటివిటి పెంచేలా కామెంట్స్ చేసుకుంటున్నారు. 

సన్నీ మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఒకే గ్రాఫ్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. షణ్ముఖ్ పై అంచనాలు ఉన్నప్పటికీ టాస్క్ లలో అతడు అంత యాక్టివ్ కాదు అనే విమర్శ ఉంది. మిగిలిన విషయాలలో కరెక్ట్ పాయింట్ మాట్లాడడం అతడి బలం. కానీ షణ్ముఖ్ పేరు ఇద్దరి ఫైనలిస్టుల రేసులో వినిపిస్తుండడం కాస్త అనూహ్యమే. 

ప్రారంభంలో మానస్, శ్రీరామ్ లపై మంచి అంచనాలు ఉండేవి. కానీ చివరికి వచ్చేసరికి వీరిద్దరూ కొంచెం డల్ అయ్యారు. కానీ టాప్ 5 లో మాత్రం వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, కాజల్.. మానస్ లేదా రవి టాప్ 5 లో ఉంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

Also Read: ఏపీ ప్రభుత్వంపై దిమ్మతిరిగే సెటైర్ వేసిన హీరో నవదీప్.. మామూలుగా పేలలేదుగా..

ఇదిలా ఉండగా సన్నీ, షణ్ముఖ్ అభిమానులు పరస్పర విమర్శలతో సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. దీనితో సన్నీ తల్లి కళావతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మీకు నచ్చిన వారికి ఓట్లు వేసి గెలిపించండి.. అంతేకాని నెగిటివ్ కామెంట్స్ చేయవద్దు. ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జీరో చేయవద్దు అని ఆమె నెటిజన్లని చేతులు జోడించి వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?