ది ఫ్యామిలీ మాన్ 3లో విజయ్ సేతుపతి ?

Published : Jun 20, 2021, 07:23 AM ISTUpdated : Jun 20, 2021, 07:26 AM IST
ది ఫ్యామిలీ మాన్ 3లో విజయ్ సేతుపతి ?

సారాంశం

ఫస్ట్ సీజన్ కి మించిన రెస్పాన్స్ ది ఫ్యామిలీ మాన్ 2 అందుకుంది. సమంత లాంటి స్టార్ నటించడం ఈ సిరీస్ కి ప్లస్ అయ్యింది. రెండు సీజన్స్ సక్సెస్ నేపథ్యంలో ముచ్చటగా మూడో సీజన్ కి సిద్ధం అవుతున్నారట రాజ్-డీకే.   

దర్శక ద్వయం రాజ్-డీకే  ది ఫ్యామిలీ మాన్ సిరీస్ తో అద్భుతాలు చేస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో దానికి కొనసాగింపుగా సీజన్ 2 తెరకెక్కించారు. ఫస్ట్ సీజన్ కి మించిన రెస్పాన్స్ ది ఫ్యామిలీ మాన్ 2 అందుకుంది. సమంత లాంటి స్టార్ నటించడం ఈ సిరీస్ కి ప్లస్ అయ్యింది. రెండు సీజన్స్ సక్సెస్ నేపథ్యంలో ముచ్చటగా మూడో సీజన్ కి సిద్ధం అవుతున్నారట రాజ్-డీకే. 


దీనికి సంబంధించి ఇప్పటికే ఓ కథ అనుకున్నారట. స్క్రిప్ట్ డెవలప్మెంట్ మాత్రం మిగిలి ఉందట. ది ఫ్యామిలీ మాన్ 2 కోసం సమంతను రంగంలోకి దించిన రాజ్-డీకే ఈ సారి మరో సౌత్ స్టార్ విజయ్ సేతుపతిని సీజన్ 3కోసం తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై వీరి మధ్య సంప్రదింపులు కూడా జరిగాయట. రాజ్-డీకే ప్రతిపాదన పట్ల విజయ్ సేతుపతి సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. 


విజయ్ సేతుపతి లాంటి స్టార్ ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తే రచ్చ మాములుగా ఉండదేమో. సీజన్ 2లో కూడా విజయ్ సేతుపతి ఓ రోల్ చేయాల్సి ఉందట. తమిళ రెబల్ లీడర్ రోల్ కోసం రాజ్-డీకే విజయ్ సేతుపతిని కలిశారట. అయితే ఆ పాత్ర చేయలేనని విజయ్ సేతుపతి సున్నితంగా చెప్పి పంపారని సమాచారం. ఆ పాత్రను రిజెక్ట్ చేయడం ద్వారా విజయ్ సేతుపతి మంచి నిర్ణయం తీసుకున్నారు. లేదంటే ఆయన అనేక తలనొప్పులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అందులోను విజయ్ సేతుపతి తమిళ నటుడు కావడంతో ఆయనకు ఈ సెగ మరింతగా ఉండేది. 
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు