
సినీ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి(జూన్ 20) నుంచి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా కేసులు అదుపులోకి రావడంతో శనివారం కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమ సైతం మళ్లీ కళకళలాడబోతుంది. షూటింగ్‌లకు, థియేటర్ల ఓపెన్‌కి గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది.
కరోనా విలయం కారణంగా షూటింగ్, థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి అన్నీ ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇక యదావిధిగా షూటింగ్‌లు జరగబోతున్నాయి. అలాగే థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. మరి ఎగ్జిబిటర్లు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజులపాటు వెయిట్ చేస్తారా? లేక వెంటనే థియేటర్లని ఓపెన్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.
ప్రస్తుతం పదికిపైగా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా కారణంగానే `లవ్ స్టోరి`, `విరాటపర్వం`,`టక్ జగదీష్`, `పాగల్`, `నారప్ప`, `ఖిలాడి`, `ఆచార్య`,`అఖండ` చిత్రాలు వాయిదా పడ్డాయి. అయితే `ఆచార్య`, `అఖండ` చిత్రాల షూటింగ్‌లు ఇంకా పూర్తి కాలేదు. త్వరగా వాటిని కంప్లీట్ చేసి తెరపైకి తీసుకురాబోతున్నారు.