ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి నాని ట్రిబ్యూట్‌.. నా హృదయాన్ని కదిలించిందన్న మహేష్‌

Published : Jun 19, 2021, 06:22 PM IST
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి నాని ట్రిబ్యూట్‌.. నా హృదయాన్ని కదిలించిందన్న మహేష్‌

సారాంశం

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి కష్టాన్ని, సేవలను గుర్తు చేశారు. వారికి అంకితమించేందుకు నాని ఈ స్పెషల్‌ వీడియోని రూపొందించారు. ఆద్యంతం హృదయాలను కట్టిపడేస్తున్న ఈ వీడియో సూపర్‌ స్టార్‌ మహేష్‌ని ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది.

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కోవిడ్‌ రోగుల కోసం పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి ట్రిబ్యూట్‌గా నాని, సత్యదేవ్‌ అంట్‌ టీమ్‌ కలిసి `దారే లేదా` పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని రూపొందించారు. ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ వీడియోలో వైద్యులు పడుతున్న బాధలను, తమ వ్యక్తిగతజీవితాలను సైతం త్యాగం చేసి వారు ప్రాణాలు కాపాడేందుకు నిత్యం శ్రమిస్తున్న విధానాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. అలాగే ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి కష్టాన్ని, సేవలను గుర్తు చేశారు. వారికి అంకితమించేందుకు నాని ఈ స్పెషల్‌ వీడియోని రూపొందించారు.ఇందులో సత్యదేవ్‌, రూప కొడవయూర్‌ నటించారు.

ఆద్యంతం హృదయాలను కట్టిపడేస్తున్న ఈ వీడియో సూపర్‌ స్టార్‌ మహేష్‌ని ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. దీంతో ఆయన సైతం స్పందించి దీన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. `మన ఫ్రంట్‌లైన్‌  వర్కర్స్ ని గౌరవించేందుకు మంచి దారిని ఎంచుకున్నారు. నిండు హృదయంతో చేసిన ఈ వీడియో నా హృదయం కోసం సంతోషంతో నిండిపోయింది. నాని, అతని టీమ్‌ అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించారు` అంటూ మహేష్‌ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌