సంక్రాంతి మూవీ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫ్లాట్ ఫార్మ్ లో వారసుడు ఫిబ్రవరి నుండి అందుబాటులోకి రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
2023 సంక్రాంతి చిత్రాల్లో వారసుడు పర్లేదు అనిపించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపింది. ముఖ్యంగా తమిళ్ వెర్షన్ వారిసు ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. టాక్ తో సంబంధం లేకుండా విజయ్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించారు. తెలుగు వెర్షన్ సైతం పర్లేదు అనిపించింది. చెప్పుకోదగ్గ వసూళ్లు సినిమాకు దక్కాయి. మొత్తంగా నిర్మాత దిల్ రాజు సేవ్ అయినట్లే లెక్క.
ఇక వారసుడు డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ధరకు వారసుడు హక్కులు ప్రైజ్ సొంతం చేసుకుందట. అలాగే ఫిబ్రవరి 10 నుండి వారసుడు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ కానుందట. అధికారిక ప్రకటన రాకున్నప్పటికే చిత్ర వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల ఎంత పెద్ద హిట్ మూవీ అయినా నాలుగు వారాల్లో ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని కొట్టిపారేయలేం.
దర్శకుడు వంశీ పైడిపల్లి యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు. శ్రీకాంత్, జయసుధ, శరత్ కుమార్,ప్రకాష్ రాజ్ తో పాటు భారీ తారాగణం నటించారు.