చిత్ర పరిశ్రమలో విషాదం.. కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నిర్మాత!

Published : Jan 20, 2023, 03:56 PM ISTUpdated : Jan 20, 2023, 03:58 PM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నిర్మాత!

సారాంశం

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. గతేడాది ఇండస్ట్రీలో సీనియర్లుగా ఉన్న ప్రముఖులు ఒక్కొక్కరిగా కన్నుమూయడం బాధాకరం. తాజాగా సీనియర్ ప్రొడ్యూసర్ తుదిశ్వాస విడిచారు.   

గతేడాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లెజెండరీ నటులు కన్నుమూయడం ఇండస్ట్రీకి తీరని లోటుగా మారింది. ఒక్కరి తర్వాత ఒకరి మరణవార్త వినాల్సి రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 

ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఏ సూర్య నారాయణ (A Suryanarayana) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారు జామున మరణించినట్టు సమాచారం. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యనారాయణ నిర్మాత పలు చిత్రాలు నిర్మించారు.  అన్నగారు.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడివి రాముడు’ (Adivi Ramudu) చిత్రానికి సూర్యనారాయణ కూడా నిర్మాతగా వ్యవహరించారు. వాటితో పాటు మరిన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక మరణంతో సీనియర్లు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

ఇక గతేడాది టాలీవుడ్ కు పెద్ద దెబ్బె పడింది. లెజెండరీ యాక్టర్, రెబల్ స్టార్ కృష్ణం రాజు, నట సామ్రాట్ సూపర్ స్టార్ కృష్ణ, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ, సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. వీరితో పాటు దర్శకులు శరత్, తాటినేని రామరావు, నటుడు మన్నవ బాలయ్య, మరణించారు. 
 

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్