Samantha: షారుక్ పక్కన సమంత... నయనతార తప్పుకోవడంతో మళ్ళీ ఛాన్స్!

By team telugu  |  First Published Oct 27, 2021, 9:02 AM IST

షారుఖ్ ఖాన్- అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లయన్ మూవీలో Samanthaకు తిరిగి ఛాన్స్ దక్కిందట. 


సమంత ఖాతాలో బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ వచ్చి చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్- అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లయన్ మూవీలో Samanthaకు తిరిగి ఛాన్స్ దక్కిందట. ప్రస్తుతం లయన్ చిత్ర హీరోయిన్ గా ఉన్న నయనతార తప్పుకోవడంతో సమంత వద్దకు ఈ సినిమా ఆఫర్ వచ్చిందన్న మాట వినిపిస్తుంది. 


పుణేలో నిరవధికంగా లయన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. దీనితో షూటింగ్ అర్థాంతరంగా ఆపివేసిన Shahrukh khan, కొడుకును జైలు నుండి బయటికి తీసుకొచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాలుగా లయన్ షూటింగ్ నిలిచిపోయింది. మరలా షూటింగ్ కి షారుక్ ఎప్పుడు హాజరవుతారో అర్థంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒప్పుకున్న కొత్త ప్రాజెక్ట్స్ డేట్స్ డిస్టర్బ్ అవుతాయని భావించిన నయనతార, ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి.

Latest Videos

Also read కూకట్‌పల్లి కోర్ట్ లో సమంతకి ఊరట.. ఆ కామెంట్లు తొలగించాలని ఆదేశం..

దీంతో లయన్ ఆఫర్ సమంత వద్దకు చేరిందట. నిజానికి Nayanatara కంటే ముందు లయన్ మూవీ ప్రపోజల్ సమంత వద్దకే వచ్చింది. వ్యక్తిగత కారణాలతో సమంత ఈ ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరించారట. నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. మరలా కెరీర్ పై ఫోకస్ పెట్టిన సమంత ఈ మూవీ చేయనున్నారనేది మీడియాలో వినిపిస్తున్న మాట. 

Also read హాట్ బాంబ్ శ్రీరెడ్డితో సుడిగాలి సుధీర్, పక్కనే బిగ్ బాస్ ప్రియ... ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో
కాగా సమంత నటించిన మైథలాజికల్ చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దర్శకుడు గుణశేఖర్ Shakuntalam చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే రెండు బైలింగ్వల్ చిత్రాలు సమంత ప్రకటించడం జరిగింది. షారుక్ మూవీపై కూడా అధికారిక ప్రకటన వస్తే, సమంత కెరీర్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఇక ఇటీవల చార్ ధామ్ యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన సమంత త్వరలో షూటింగ్ లో జాయిన్ కానున్నారు. 

click me!