మంచు మనోజ్‌ రెండో పెళ్లి.. నన్ను కూడా ఆహ్వానించండంటూ మంచు హీరో దిమ్మతిరిగే కౌంటర్‌

Published : Oct 26, 2021, 11:04 PM ISTUpdated : Oct 26, 2021, 11:12 PM IST
మంచు మనోజ్‌ రెండో పెళ్లి.. నన్ను కూడా ఆహ్వానించండంటూ మంచు హీరో దిమ్మతిరిగే కౌంటర్‌

సారాంశం

సోషల్‌ మీడియాలో ఈ వార్తలు హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై మంచు మనోజ్‌ స్పందించారు. ఓ వెబ్‌ మాధ్యమం రాసిన వార్తని కోట్‌ చేస్తూ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు అదిరిపోయే పంచ్‌ వేశాడు.

మంచు మనోజ్‌(Manchu Manoj) సెకండ్‌ మ్యారేజ్‌పై వార్తలు ఊపందుకున్నాయి. రెండో పెళ్లికి మనోజ్‌ సిద్ధమయ్యాడనే రూమర్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. Manchu Manoj ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు ఆయన్ని సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారట. అయితే మనోజ్‌ ఓ ఫారెన్‌ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, ఆమెని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారని వార్తలొచ్చాయి. కానీ మోహన్‌బాబు(Mohanbabu) మాత్రం సమీప బంధువుల అమ్మాయితో మ్యారేజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారట. 

సోషల్‌ మీడియాలో ఈ వార్తలు హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై మంచు మనోజ్‌ స్పందించారు. ఓ వెబ్‌ మాధ్యమం రాసిన వార్తని కోట్‌ చేస్తూ Manchu Manoj Second Marriageపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు అదిరిపోయే పంచ్‌ వేశాడు. `పెళ్లికి తనని కూడా ఆహ్వానించండి. పెళ్లి ఎక్కడ. బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఎవరు? అంటూ నవ్వుతున్న ఎమోజీలు పంచుకున్నాడు మనోజ్‌. అంతే కాదు తన అసహనాన్ని పంచుకున్నారు. `మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం` అంటూ కామెడీగా తన కోపాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మంచు మనోజ్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే మంచు మనోజ్‌ 2015లో ప్రణతిరెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేండ్ల వైవాహిక జీవితం అనంతరం 2019 అక్టోబర్‌లో వీరిద్దరు విడిపోయారు. తమ ఇద్దరి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల కారణంగా వీరిద్దరు విడిపోయినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాడు మనోజ్‌. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెకండ్‌ మ్యారేజ్‌పై వార్తలు ఊపందుకోవడం, తాజాగా ఆ వార్తలపై మనోజ్‌ స్పందించి తనదైన స్టయిల్‌లో కౌంటర్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

కెరీర్‌ పరంగా చూస్తే నాలుగేళ్ల క్రితం `ఒక్కడు మిగిలాడు` చిత్రంలో మెరిశాడు మంచు మనోజ్‌.  ఆ సినిమా పరాజయం చెందడంతో కెరీర్‌ పరంగా గ్యాప్‌ వచ్చింది. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు మనోజ్‌. ప్రస్తుతం ఆయన `అహం బ్రహ్మాస్మి` చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మనోజ్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడే వార్తలు వినిపించగా, వాటిని ఖండించాడు మనోజ్‌. త్వరలో బ్యాక్‌టూ బ్యాక్‌ సినిమాలతో రాబోతున్నట్టు చెప్పారు. 

also read: పెళ్లిపై తనదే ఫైనల్‌ డిసీషన్‌ అంటోన్న రీతూ వర్మ.. వెడ్డింగ్‌ ఎప్పుడో కూడా చెప్పేసిందిగా..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు