కాజల్ అగర్వాల్ కు కోర్టులో చుక్కెదురు

First Published Aug 10, 2017, 8:29 PM IST
Highlights
  • తాజాగా నేనేరాజు నేనే మంత్రి చిత్రంలో రాధగా వస్తోన్న కాజల్
  • రానా సరసన హీరోయిన్ గా భార్య పాత్రలో నటించిన కాజల్
  • కోకోనట్ ఆయిల్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన కాజల్ కు చుక్కెదురు

తాజాగా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాథ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్ కు కోర్టులో చుక్కెదురైంది. అంతేకాదు కోర్టు కాజల్ కు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ కోర్టు ఎందుకు చురకలేసిందంటే... వీవీడీ కొబ్బరినూనె తయారీ సంస్థపై కాజల్‌ కోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. విచారించిన కోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడమే కాకుండా ఇప్పటివరకు ఆ కంపెనీకి అయిన కోర్టు ఖర్చంతా కూడా కాజల్ అండ్ కో పెట్టుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది.

 

కేసు వివరాల్లోకి వెళితే.. 2008లో వీవీడీ కొబ్బరినూనె ప్రకటనలో నటించడానికి ఆ సంస్థతో కాజల్‌ ఎగ్రిమెంట్ చేసుకుంది. ఒక్క ఏడాదిపాటే ప్రసారంచేయాలనే నిబంధనతోనే ఆ ప్రకటనలో నటించానని, కానీ దాన్ని ఆ తర్వాతా ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఆమె 2011లో మద్రాసు హైకోర్టులో కేసు వేసింది.

 

ఒప్పందం ముగిసినప్పటికి తన ఫోటోను ఆ సంస్థ వాడుకుంటుందని అందుకు నష్టపరిహారంగా ఆసంస్థ రెండున్నర కోట్లు చెల్లించాలంటూ ఆదేశం ఇవ్వాలని కాజల్ కోర్టుని కోరింది. దీనిపై తుది విచారణ జరిపిన జడ్జి జస్టిస్ టీ రవీంద్రన్ 60 సంవత్సరాల పాటు ఆ యాడ్ పై హక్కులు ఆ సంస్థకి ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో యాడ్ ని ఏడాది తర్వాత ప్రసారం చేయకూడదని కాజల్ డిమాండ్ చేయడం తప్పని స్పష్టం చేశారు.

 

నిజానికి కాజల్ కోర్టుకు ఎక్కటానికి కారణం ఏంటంటే... ఆ యాడ్ చేశాక కాజల్ కు...  ఒక పెద్ద కోకోనట్ ఆయిల్ యాడ్ వచ్చింది. ఈ కొత్త యాడ్ చేసుకోవాలంటే పాత యాడ్ డీల్ క్యాన్సిల్ చేసుకోవాలి. అందుకని తెలివిగా వ్యవహరించిన కాజల్ కోర్టుకెక్కింది. అయితే కాపీరైట్స్‌ చట్టప్రకారం ఒక ప్రకటన దాన్ని రూపొందించిన సంస్థకే చెందుతుందన్నారు. అంతే కాకుండా 60ఏళ్ల వరకు వాణిజ్యప్రకటన ప్రమోషన్‌ హక్కులు వారికి ఉంటాయని చెబుతూ.. ఒక్క ఏడాదిలోనే ఆ ప్రకటనను ప్రసారం చేయాలని హక్కులేదని, ఒక వాణిజ్య ప్రకటన ప్రమోషన్‌ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకూ ఉంటాయని తీర్పు చెప్పారు. దీంతో కాజల్ కు కొత్త యాడ్ ఎండోర్స్ మెంట్ వస్తుందో రాదో చూడాలి.

click me!