
రానా హీరోగా వస్తోన్న తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధపడ్డ రానాను, టీవీ9 మహిళా యాంకర్ డ్రగ్స్ పై ప్రశ్నించింది. దీంతో సీరియస్ అయిన రానా... ఆమెపై ఆగ్రహంతో వూగిపోయాడు. ఆ వీడియోను సదరు ఛానెల్ నెట్ లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యాంకర్ అడిగిన ప్రశ్నకు తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో కోపంతో చూస్తూ, యాంకర్ పై చిటికలు వేస్తూ, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దని సీరియస్ గా రానా వార్నింగ్ ఇవ్వడంతో యాంకర్ జడుసుకుని బిత్తర చూపులు చూసింది. దీనిపై రానాకు అంత ఆగ్రహం ఎందుకని నెటిజన్లు ప్రశ్నించారు కూడా.
అయితే ఆ వీడియో అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించాడు. "సార్, మీరు నిజంగానే టీవీ 9 యాంకర్ పై ఆగ్రహం చూపారా? లేక అది పబ్లిసిటీ కోసమా? అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఆ ఛానెల్ యాంకరే అలా చెప్పాలని సూచించిందని.. ప్రోమో కట్ కోసమే ఇదంతా చేశానని రానా ట్విటర్ లో సమాధానం ఇచ్చాడు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు డ్రగ్స్ విదేశాల నుండి పార్శల్స్ రూపంలో వస్తున్నాయని గ్రహించిన అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల రామానాయుడు స్టూడియోకి విదేశాల నుండి హీరో రానా పేరు మీద పార్సిల్ రావడంతో ఎక్సైజ్ శాఖ సీఐ కనకదుర్గ దాన్ని పరిశీలించేందుకు స్టూడియోకు వెళ్లడం చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్లలో భాగంగా టీవీ 9 ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాకు డ్రగ్స్ కేసు, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శిల్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. డ్రగ్స్ వ్యవహారం గురించి, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శల్ గురించి అడగ్గానే రానా... ఆగ్రహంతో ఊగిపోయారు.
పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దంటూ యాంకర్ మీద అరిచాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రానా అంత కోపం చూపించటం చాలామందిని ఆశ్చర్యనికి గురి చేసింది...
అయితే ఇప్పుడు దానివెనక ఉన్న స్టోరీని, ప్రేక్షకులని ఫూల్స్ చేసి టీఆర్పీ లని పెంచుకునే ప్రయత్నాలనీ బయటపెట్టేసాడు రానా. అయితే ఇదంతా నిజమేనా లేక ప్రీ ప్లాన్డా అనేది మనం ఆ ప్రోమోని చూసినప్పుడే అర్దమవుతుంది.
ఇటీవల 'విఐపి-2' సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకు వస్తే తన పర్సనల్ లైఫ్ విషయాలను అడగటం(యాంకర్ సరిగా ప్రశ్నలను కమ్యునికేట్ చేయలేకపోవడం)తో నొచ్చుకున్న ధనుష్ 'స్టుపిడ్ ఇంటర్వ్యూ' అంటూ మైక్ పీకేసి అక్కడ్నించి వెళ్లిపోయాడు. ధనుష్ వాకౌట్ చేసిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అదే తరహాలో ఇప్పుడు ఈ వీడియో కూడా అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించడంతో నిజం వెల్లడైంది. ఒక రకంగా ఈ విషయం చెప్పి ఇలాంటి ప్రోమోల విషయం లో జనాన్ని టీవీ చానెళ్ వాళ్ళు ఎంతగా ఫూల్స్ ను చేస్తున్నారో చెప్పాడు రానా.