వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌.. నాలుక కోస్తే కోటీ

Published : Jan 23, 2021, 09:04 PM IST
వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌.. నాలుక కోస్తే కోటీ

సారాంశం

`తాండవ్` వెబ్‌ సిరీస్‌లో హిందూ దేవుళ్లని కించపరిచారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర కర్ణి సేన చీఫ్‌ సెంగర్‌ `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లని అవమానించిన వారి నాలుక కోసిన వారికి కోటీ రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. 

హిందీలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ `తాండవ్‌` ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది మహారాష్ట్ర అయ్యింది. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో, డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ని అలీ అబ్బాస్ జాఫర్‌ దర్శకత్వం వహించారు. ఏ.ఆర్‌ రెహ్మాన్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 15న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. 

ఈ వెబ్‌ సిరీస్‌లో హిందూ దేవుళ్లని కించపరిచారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర కర్ణి సేన చీఫ్‌ సెంగర్‌ `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లని అవమానించిన వారి నాలుక కోసిన వారికి కోటీ రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఈ వెబ్‌ సిరీస్‌పై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించి క్షమాపణలు చెప్పింది. అయితే క్షమాపణలు ఆమోదయోగం కాదని అజయ్‌ సెంగర్‌ తెలిపారు. 

మరోవైపు ఈ వెబ్‌ సిరీస్‌ చిత్ర బృందం, అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా హెడ్‌ ఆఫ్‌ ఒరిజినల్‌ కంటెంట్‌ అపర్ణ పురోహిత్‌, వెబ్‌ సిరీస్‌ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌, నిర్మాత హిమాన్షు మెహ్రా, రచయిత గౌరవ్‌ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో సినిమాని సినిమాగా చూడాలని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా