నాగ్‌ అశ్విన్‌ సినిమా నుంచి మరో గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్న ప్రభాస్‌.. డేట్‌ ఫిక్స్

Published : Jan 23, 2021, 04:27 PM ISTUpdated : Jan 23, 2021, 04:30 PM IST
నాగ్‌ అశ్విన్‌ సినిమా నుంచి మరో గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్న ప్రభాస్‌.. డేట్‌ ఫిక్స్

సారాంశం

నాగ్‌ అశ్విన్ తో ప్రభాస్‌ చేసే‌ సినిమాపై సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమా ఇప్పట్లో ఉంటుందా? మరో ఏడాది పట్టాల్సిందేనా? అనే డౌన్‌ వస్తోంది. నాగ్‌ అశ్విన్‌  సినిమాపై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. 

ప్రభాస్‌ వరుసగా నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యారు. అందులో `రాధేశ్యామ్‌` షూటింగ్‌ జరుపుకుంటోంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా, బాలీవుడ్‌ చిత్రం `ఆదిపురుష్‌`, అలాగే `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` సినిమాలు చేయనున్నారు. ఇప్పటికే `సలార్‌` చిత్రం ప్రారంభమైంది. త్వరలోనే `ఆదిపురుష్‌` కూడా ప్రారంభం కాబోతుంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ సినిమాపై సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమా ఇప్పట్లో ఉంటుందా? మరో ఏడాది పట్టాల్సిందేనా? అనే డౌన్‌ వస్తోంది. 

నాగ్‌ అశ్విన్‌  సినిమాపై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. `కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29, ఫిబ్రవరి 26` అని పేర్కొన్నాడు నాగ్‌ అశ్విన్‌. దీంతో సినిమాకి సంబంధించి జనవరి 29న గుడ్‌ న్యూస్‌రాబోతుందని ప్రభాస్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఆ రోజు సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని ప్రకటించి, ఫిబ్రవరి 26న సినిమాని ప్రారంభిస్తారా? లేక ఈ రెండు తేదీలో స్పెషల్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మరో ఆరు రోజుల్లో ప్రభాస్‌ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారనేది కన్ఫమ్‌ అయ్యింది. 

ఇక సైన్స్ ఫిక్షన్‌గా దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటిస్తుంది. ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇతర భాషలకు చెందిన నటులు కూడా నటిస్తారని టాక్‌. ఇక ప్రస్తుతం రూపొందుతున్న `రాధేశ్యామ్‌` చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా, పెద్దనాన్న కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. పరమహంసగా ఆయన కనిపిస్తారట. ఈ సినిమాని ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా