స్వతహాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నందిత శ్వేత..శారీలో సూపర్‌

Published : Jan 23, 2021, 07:29 PM ISTUpdated : Jan 23, 2021, 09:48 PM IST
స్వతహాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నందిత శ్వేత..శారీలో సూపర్‌

సారాంశం

`మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఎంతో ముఖ్యం` అని తెలిపింది హీరోయిన్‌ నందిత శ్వేత. ఎంపీ సంతోష్‌ కుమార్‌ జోగిని పల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వతహాగా స్వీకరించిన నందిత శ్వేత శనివారం గచ్చిబౌలిలో మొక్కలు నాటింది. 

`మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ఎంతో ముఖ్యం` అని తెలిపింది హీరోయిన్‌ నందిత శ్వేత. ఎంపీ సంతోష్‌ కుమార్‌ జోగిని పల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని స్వతహాగా స్వీకరించిన నందిత శ్వేత శనివారం గచ్చిబౌలిలో మొక్కలు నాటింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, `గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం గురించి తెలుసుకుని స్వతహాగా ఛాలెంజ్‌ని స్వీకరించానని చెప్పింది. 

ఇంకా చెబుతూ, మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఛాలెంజ్‌ పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని చెప్పింది. ఇంత మంది కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకువెళ్తున్న సంతోష్‌ కుమార్‌కి థ్యాంక్స్` అని చెప్పింది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌, హీరో నిఖిల్‌, `కల్కి` సినిమా డైరెక్టర్‌ ప్రశాంత్‌ లకు ఛాలెంజ్‌ విసిరింది. ప్రస్తుతం నందిత శ్వేత తెలుగులో `ఐపీసీ 376`, `కపటదారి` చిత్రాల్లో నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా