వివాదంలో శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్'.. సమాజాన్ని నాశనం చేసే చిత్రం అంటూ..

pratap reddy   | Asianet News
Published : Aug 18, 2021, 08:52 PM IST
వివాదంలో శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్'.. సమాజాన్ని నాశనం చేసే చిత్రం అంటూ..

సారాంశం

బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రీముఖి సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'క్రేజీ అంకుల్స్'. 

బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రీముఖి సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'క్రేజీ అంకుల్స్'. ఈనెల 19న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో క్రేజీ అంకుల్స్ మూవీ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇటీవల విడుదలైన క్రేజీ అంకుల్స్ చిత్ర ట్రైలర్ లో మహిళల్ని కించపరిచేలా డైలాగులు. సన్నివేశాలు ఉన్నాయని తెలంగాణ మహిళా ఐక్యవేదిక కార్యదర్శి రత్న ఆరోపించారు. ఇండియా కుటుంబ వ్యవస్థతో కూడుకున్న దేశం. అలాంటి కుటుంబ వ్యవస్థని నాశనం చేసేలా సినిమాలు చేస్తున్నారు. క్రేజీ అంకుల్స్ చిత్ర ట్రైలర్ లో డైలాగులు సమాజాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయని రత్న అన్నారు. 

క్రేజీ అంకుల్స్ చిత్రంలో మహిళల్ని కించపరిచే సన్నివేశాలు తొలగించాలి. లేకుండా సినిమా రిలీజ్ ని అడ్డుకుంటాం అని హెచ్చరించారు. క్రేజీ అంకుల్స్ చిత్రం కొంచెం అడల్ట్ కంటెంట్ టచ్ తో కనిపిస్తోంది. 

ట్రైలర్ లో చూపిన దాని ప్రకారం ముగ్గురు అంకుల్స్ ఓ యువతిపై మోజు పడ్డ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముగ్గురు అంకుల్స్ గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి శంకర్ నటించారు. అడల్ట్ కామెడీతో ఈ చిత్రం తెరకెక్కింది. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై దర్శకుడు సత్తి బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు