తీవ్ర భావోద్వేగంతో నాని.. టక్ జగదీష్ రిలీజ్ పై ఫ్యాన్స్ కి లేఖ

Published : Aug 18, 2021, 07:29 PM IST
తీవ్ర భావోద్వేగంతో నాని.. టక్ జగదీష్ రిలీజ్ పై ఫ్యాన్స్ కి లేఖ

సారాంశం

నేచురల్ స్టార్ నాని ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరాడు. అందరి హీరోల అభిమానులు నాని సినిమా చూడడానికి ఇష్టపడతారు. తన నటనతో నాని అంతటి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

నేచురల్ స్టార్ నాని ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరాడు. అందరి హీరోల అభిమానులు నాని సినిమా చూడడానికి ఇష్టపడతారు. తన నటనతో నాని అంతటి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకోవడం నాని స్టైల్. 

ఇదిలా ఉండగా నాని ప్రస్తుతం సంకట పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. తమ అభిమాన హీరో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తాము నటించిన ప్రతి చిత్రం థియేటర్స్ లోనే రిలీజ్ కావాలని ప్రతి నటుడు కోరుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు సహకరించడం లేదు. 

నాని చివరగా నటించిన 'వి' మూవీ కరోనా కారణంగా ఓటిటిలో విడుదలయింది. ఇప్పుడు నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ కూడా ఓటిటి బాట పడుతోంది. ఈ నేపథ్యంలో నాని తీవ్ర భావోద్వేగానికి గురవుతూ అభిమానులకు బహిరంగ లేఖ రాశాడు. 

'నేను థియేటర్స్ కి పెద్ద అభిమానిని. టక్ జగదీశ్ చిత్రం ఒక పండుగలా థియేటర్స్ లోనే విడుదల కావాలని ఆశించాం. ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులతో కలసి చూడాలనుకునే నేను ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నా. కరోనా వల్ల ఇండియాలో, విదేశాల్లో పరిస్థితులు సరిగా లేవు. దీనికి తోడు ఆంధ్రలో థియేటర్స్ పై ఊహించని నిబంధనలు ఉన్నాయి. 

కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతల నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. కానీ నేను మరోసారి సంకట పరిస్థితిలో చిక్కుకున్నా. టక్ జగదీశ్ రిలీజ్ నిర్ణయాన్ని షైన్ స్క్రీన్ సంస్థకే వదిలేస్తున్నా. వారి తుది నిర్ణయాన్ని గౌరవిస్తా. ఏదైతే నేం.. చిత్రం మీ అందరికీ రీచ్ అయ్యేవరకు 100శాతం కృషి చేస్తా' అంటూ నాని అభిమానులకు ఎమోషనల్ లెటర్ రాశాడు. 

దీనిని బట్టి టక్ జగదీశ్ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి